అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Janhvi Kapoor | బాలీవుడ్ సూపర్ స్టార్ శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ‘ధడక్’ సినిమాతో డెబ్యూ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత ‘ది కార్గిల్ గర్ల్’, ‘రూహి’, ‘మిల్లీ’, ‘గుడ్ లక్ జెర్రీ’ వంటి సినిమాలతో ప్రేక్షకుల్లో తన ప్రత్యేక గుర్తింపును సంపాదించింది.
అలాగే, టాలీవుడ్‌లోనూ ఎన్టీఆర్ సరసన ‘దేవర’ సినిమాలో నటించి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. ప్రస్తుతం రామ్ చరణ్ – బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘పెద్ది’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే జాన్వీ కపూర్ (Janhvi Kapoor)సినిమాల కన్నా కూడా తన గ్లామరస్ ఫొటోలు, వ్యక్తిగత జీవితం, ప్రేమ, డేటింగ్ అనుభవాల గురించి మాట్లాడుతూ వార్తలలో నిలుస్తూ ఉంటుంది.
Janhvi Kapoor | క్రేజీ కామెంట్స్..
ఓ ఇంటర్వ్యూలో జాన్వీ మాట్లాడుతూ, విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడి కొంతమంది వెయిటర్లు ఆమెను టార్గెట్ చేసేవారని, అడగకుండానే ఫుడ్ ఐటమ్స్ తెచ్చి ఫోన్ నంబర్లు ఇస్తూ ఇబ్బంది పెట్టేవారని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో తప్పించుకోవడానికి “నాకు పెళ్లయింది, ఒర్రీ (Orry) నా భర్త” అని చెప్పేదాన్ని అని ఓ సందర్భంలో షాకింగ్ కామెంట్స్ చేశారు. జాన్వీ భవిష్యత్తులో తన పెళ్లి గురించి కూడా కొన్ని ఆలోచనలు బయటపెట్టారు. “తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం (Tirupati Venkateswara Swamy Temple)లో మూడు రోజుల సాంప్రదాయ రీతిలో పెళ్లి చేసుకోవాలి. కాంచీవరం సీర్తీ ధరించి, అరటి ఆకులపై భోజనం ఏర్పాటు చేయాలి” అని తన కోరికను తెలిపారు.ప్రస్తుతం జాన్వీ శిఖర్ పహారియాతో ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ పబ్లిక్‌లో కపుల్‌గా కనిపిస్తూ, అభిమానుల్లో వీరి రిలేషన్‌పై పెద్ద ఆసక్తి రేపుతున్నారు.
బాలీవుడ్ స్టార్ జాహ్నవి కపూర్ తాజాగా పారిస్ (Paris)లోని మియూ మియూ ఫ్యాషన్ షోకు హాజరై అభిమానులను మంత్రముగ్ధులు చేశారు. ఈ షోలో తన లుక్‌తో అదరగొట్టింది. అలానే ఫన్ రాపిడ్-ఫైర్ సెగ్మెంట్‌లో పాల్గొని తన హాస్యభరితమైన, రొమాంటిక్ యాంగిల్‌ని అభిమానులకు చూపించారు. జాహ్నవి ప్రేమ, ఫుడ్ మరియు ఫ్రెంచ్ కల్చర్ గురించి ఆసక్తికర విషయాలు మాట్లాడింది. ప్రేమ గురించి మాట్లాడుతూ.. తనకి చాలా ఆఫెక్షన్ కావాలి అని చెప్పింది. ఎప్పుడు కావాలంటే ఫుడ్ ప్రిపేర్ చేయాలి. నన్ను నవ్వించాలి అని పేర్కొంది. నాది మీన రాశి (Meena Raashi)కాబట్టి నేను ఈ గ్రహం మీద నివసించను అని ఆమె చమత్కరించింది, మీన రాశి వారు మేష రాశి వారితో బాగా కలిసి ఉండరు. నా సన్నిహితులు చాలా మంది మేష రాశికి చెందినవారని కూడా ఆమె అన్నారు. స్పెగెట్టీ, మాల్పువా, రబ్డీ వంటి భోజనాలు ఇష్టమని తెలిపారు. ఫ్రెంచ్‌లో జాహ్నవి పేరు జీన్ వియెర్ అని పలకడం బాగుంది అని చెప్పారు.