అక్షరటుడే, కామారెడ్డి : Janasena Party | ప్రస్తుతం జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కామారెడ్డి మున్సిపాలిటీ (Kamareddy Municipality)లో జనసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ కామారెడ్డి ఇన్ఛార్జ్ లక్ష్మీనర్సాగౌడ్ తెలిపారు. హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న పార్టీ కార్యాలయంలో మంగళవారం పలువురు అభ్యర్థులు జనసేన పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
Janasena Party | జనసేన పార్టీ చీఫ్ సూచన మేరకు
జనసేన పార్టీ చీఫ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) సూచన మేరకు తెలంగాణలో జనసేన పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) ఒంటరిగా పోటీ చేస్తుందన్నారు. కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో 15 నుంచి 16 వార్డుల్లో జనసేన పోటీలో ఉంటుందని, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లకు గట్టి పోటీ ఇస్తుందని తెలిపారు. వార్డుల్లో సమస్యలు తెలుసుకుని మేనిఫెస్టో తయారు చేస్తామని తెలిపారు. కొండగట్టు (Kondagattu)కు పవన్ కళ్యాణ్ విరాళం ప్రకటించిన తర్వాత తెలంగాణలో పార్టీకి బలం పెరిగిందని, పార్టీపై ప్రజలకు నమ్మకం ఏర్పడిందన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీలో 9 వార్డుల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తయిందని, పోటీచేసే అభ్యర్థులను గెలిపించుకుని పవన్ కళ్యాణ్‌కు గిఫ్ట్ ఇస్తామన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీకి షాక్‌లు తగులుతున్నాయని, ఆ పార్టీల నుంచి జనసేనలోకి వలసలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో కామారెడ్డిలో జనసేన పార్టీని బలోపేతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీకాంత్, రవి, శరత్, మల్లేశం, జీవన్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.