అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kavitha Janam Bata | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) జనంబాటలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
తాను బీఆర్ఎస్ పార్టీ (BRS party) బాగుండాలని కోరుకుంటే పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఆమె పేర్కొన్నారు. సస్పెండ్ చేసే ముందు తన వివరణ తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ఆమె స్పష్టం చేశారు. పార్టీ ఏర్పాటుకు కావాల్సిన అవగాహన కోసం రాష్ట్రవ్యాప్తంగా జనంబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని చెప్పారు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో (2029 assembly elections) అన్ని సీట్లలో పోటీ చేస్తామన్నారు.
Kavitha Janam Bata | హరీశ్‌రావుపై ఆరోపణలు
కవిత పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి ప్రాజెక్ట్‌లను సందర్శించారు. తాను నిజామాబాద్ ఎంపీగా (Nizamabad MP) ఉన్న సమయంలో ఎక్కడ తిరగకుండా కొందరు అడ్డుకున్నారని చెప్పారు. వారే తర్వాతి ఎన్నికల్లో తనను ఓడించారని ఆరోపించారు. హరీశ్‌రావుపై మరోసారి ఆమె ఆరోపణలు చేశారు. కమీషన్ల కోసం పాలమూరును ప్రాజెక్టును ఆయన పాడు చేశారని ఆరోపించారు. ఓపెన్ కట్ పంప్ హౌజ్‌ను అండర్ గ్రౌండ్ పంప్ హౌజ్‌గా మార్చారన్నారు.
Kavitha Janam Bata | కాంగ్రెస్‌పై విమర్శలు
కేసీఆర్ ప్రారంభించిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో (Palamuru Rangareddy project) కాంగ్రెస్ ప్రభుత్వం తట్టెడుమట్టి తీయలేదని కవిత విమర్శించారు. కొడంగల్ లిఫ్ట్‌కు రూ.2వేల కోట్లు నిధులిచ్చి మెగా కంపెనీ, పొంగులేటి కంపెనీలకు చెరో రూ.వెయ్యి కోట్లు అడ్వాన్స్‌గా ఇచ్చారని ఆరోపించారు. జనంబాటలో ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని ఆమె పేర్కొన్నారు. దుందిబీ నదిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఇసుక దందా చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను వేగవంతంగా పూర్తి చేశారని, అదే విధంగా పాలమూరు – రంగారెడ్డి పనులు ఎందుకు చేపట్టలేదని ఆమె ప్రశ్నించారు.