Homeజిల్లాలునిజామాబాద్​Youth Congress | జనహృదయ నేత సీఎం రేవంత్ రెడ్డి: యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు...

Youth Congress | జనహృదయ నేత సీఎం రేవంత్ రెడ్డి: యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు విపుల్ గౌడ్

జనహృదయ నేతగా ప్రజల్లో సీఎం రేవంత్​రెడ్డి సుస్థిర స్థానం సంపాదించారని యూత్​కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు విపుల్​గౌడ్​ పేర్కొన్నారు. ఈమేరకు కాంగ్రెస్​ భవన్​లో సీఎం జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Youth Congress | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనహృదయ నేత అని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు విపుల్ గౌడ్ అన్నారు. సీఎం జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లా కాంగ్రెస్ భవన్​లో (Congress Bhavan) వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా విపుల్ గౌడ్ (Congress President Vipul Goud) మాట్లాడుతూ పీసీసీ పగ్గాలు చేపట్టి అనతికాలంలోనే రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తేవడమే కాకుండా సమర్థవంతంగా పాలన నడిపిస్తున్న గొప్ప వ్యక్తి సీఎం రేవంత్​రెడ్డి అని అన్నారు. అలాగే ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తూ జనహృదయనేతగా రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పేరు తెచ్చుకున్నారని పేర్కొన్నారు.

గత పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినా.. ఒకవైపు సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తూనే.. మరోవైపు అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడానికి సీఎం అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ఆయన సీఎం హోదాలో ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయాలని యూత్ కాంగ్రెస్ పక్షాన కోరుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ నాయకులు (Congress Leaders) బీఎల్ రాజు, జెండా బాలాజీ గుడి ఛైర్మన్ ప్రమోద్, విజయ్ పాల్ రెడ్డి, జైగౌడ్, యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శులు నరేందర్ గౌడ్, ఆదిత్య పాటిల్, ఇర్ఫాన్, ఆకాష్ రెడ్డి, సంజీవ్, శుభం, నిజామాబాద్ రూరల్ ప్రెసిడెంట్ ఏశాల మహేందర్, నవీన్ రెడ్డి, శ్రీను, నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News