అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | డ్రగ్స్, గంజాయి రహిత సమాజం కోసం తనవంతు ప్రయత్నం చేస్తున్నానని సూర్యాపేట ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్ తెలిపారు. గంజాయి, డ్రగ్స్ రహిత సమాజం కోసం చేపట్టిన రాష్ట్రవ్యాప్త జనచైతన్య బైక్ యాత్ర (Jana Chaitanya Bike Yatra) మంగళవారం మధ్యాహ్నం కామారెడ్డి పట్టణానికి (Kamareddy town) చేరుకుంది.
బైక్ యాత్రకు (bike yatra) ఉపాధ్యాయులు రవీందర్ రెడ్డి, స్వామి, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అంబీర్ శ్యాంరావు స్వాగతం పలికి ఉపాధ్యాయుడు ప్రభాకర్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ.. తన స్నేహితుడు విపరీతమైన ధూమపానానికి అలవాటు పడి మృతి చెందాడని.. దీంతో తాను తీవ్రంగా కలత చెందానన్నారు. అతనికి జరిగినట్టుగా మరొకరికి జరగకూడదని జనచైతన్య బైక్ యాత్ర ప్రారంభించినట్టు తెలిపారు.
Kamareddy | సూర్యాపేట ఎస్పీ..
సూర్యాపేట జిల్లా ఎస్పీ (Suryapet district SP) తన యాత్రకు జెండా ఊపి ప్రారంభించారని, ఇప్పటివరకు వివిధ జిల్లాలో 1,800 కి.మీ యాత్ర పూర్తి చేసినట్లు తెలిపారు. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలతో తన యాత్ర పూర్తవుతుందన్నారు. గతంలో మహానగరాలకు మాత్రమే పరిమితమైన డ్రగ్స్, గంజాయి పచ్చని పల్లెలకు వ్యాపించి ప్రశాంతత లేకుండా చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. యువత వీటికి అలవాటు పడి అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకుని తల్లిదండ్రులకు తీరని శోకం మిగులుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ నిర్మూలన కోసం పోలీసులు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని కోరారు.