అక్షరటుడే, న్యూఢిల్లీ: Jan 30 Pre market Analysis | యూఎస్ మార్కెట్లు(US Markets) నష్టాలతో ముగిశాయి. దీని ప్రభావం ఆసియా మార్కెట్లపైనా కనిపిస్తోంది. గిఫ్ట్ నిఫ్టీ సైతం నష్టాలతో సాగుతుండడంతో మన మార్కెట్లు భారీ గ్యాప్ డౌన్లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Jan 30 Pre market Analysis | యూఎస్ మార్కెట్లు..
గత సెషన్లో నాస్డాక్(Nasdaq) 0.49 శాతం, ఎస్అండ్పీ 0.07 శాతం నష్టపోయాయి. డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.47 శాతం నష్టంతో ఉంది.
Jan 30 Pre market Analysis | యూరోప్ మార్కెట్లు..
ఎఫ్టీఎస్ఈ 0.17 శాతం, సీఏసీ 0.06 శాతం లాభపడగా.. డీఏఎక్స్(DAX) 2.11 శాతం నష్టపోయాయి.
Jan 30 Pre market Analysis | ఆసియా మార్కెట్లు..
ఉదయం 8.20 గంటల ప్రాంతంలో ప్రధాన ఆసియా మార్కెట్లు ఎక్కువగా నష్టాలతో ఉన్నాయి. సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 0.56 శాతం లాభంతో సాగుతుండగా.. తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1.40 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్(HangSeng) 1.39 శాతం, చైనాకు చెందిన షాంఘై 1.29 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.41 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.29 శాతం నష్టాలతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.56 శాతం నష్టంతో ఉంది. దీంతో మన మార్కెట్లు గ్యాప్డౌన్లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్ఐఐలు గత సెషన్లో నికరంగా రూ. 394 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. డీఐఐలు రూ. 2,638 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 0.97 నుంచి 1.06 కు పెరిగింది.
- విక్స్ 1.15 శాతం తగ్గి 13.37 వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 16 పైసలు బలహీనపడి 91.95 వద్ద నిలిచింది.
- క్రూడ్ ఆయిల్ ధర కాస్త కూల్ ఆఫ్ అయ్యింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 68.52 డాలర్లకు తగ్గింది.