అక్షరటుడే, హైదరాబాద్: Jan 30 Gold Prices | అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చితి పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అలాగే భవిష్యత్ ఆర్థిక పరిస్థితులపై స్పష్టత లేకపోవడం నేపథ్యంలో బంగారం, వెండి ధరలు Silver Prices ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇటీవలి అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశాల్లో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించినప్పటికీ, సురక్షిత పెట్టుబడులైన పసిడి–వెండిపై డిమాండ్ మాత్రం తగ్గడం లేదు.ఈ ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్ల ట్రెండ్‌ను అనుసరిస్తూ దేశీయంగా గురువారం బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఒక్క రోజులోనే 10 గ్రాముల మేలిమి బంగారం ధర సుమారు రూ.12 వేల వరకు పెరగగా, కిలో వెండి ధర దాదాపు రూ.30 వేల మేర ఎగబాకింది.
Jan 30 Gold Prices | పరుగో పరుగు..
హైదరాబాద్ Hyderabad బులియన్ మార్కెట్లో ధరలు (జనవరి 30) గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, శుక్రవారం ఉదయం 6.00 గంటల సమయంలో 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ. 1,78,886గా నమోదైంది. ఇక 22 క్యారెట్ ఆర్నమెంటల్ బంగారం (10 గ్రాములు): రూ. 1,63,960గా ట్రేడ్ అయింది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా దాదాపు ఇదే స్థాయి ధరలు కొనసాగుతున్నాయి. చెన్నైలో 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ. 1,83,290గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ. 1,68,010గా ఉంది. (దేశంలోనే అత్యధిక రేట్లలో చెన్నై ముందుంది)
వెండి ధరల విషయానికి వస్తే ..ఢిల్లీలో Delhi కిలో వెండి ధర: రూ. 4,25,100గా ట్రేడ్ అయింది. ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర: సుమారు రూ. 4.10 లక్షలుగా ఉంది. హైదరాబాద్‌లో వెండి ధర ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 4,25,100 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే రేటు ఉండగా, ఇతర మెట్రో నగరాల్లో కొద్దిగా తక్కువ స్థాయిలో ట్రేడవుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్ ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణ భయాలు, కేంద్ర బ్యాంకుల విధానాలపై అనిశ్చితి, స్టాక్ మార్కెట్లలో వోలాటిలిటీ వంటి అంశాలు పెట్టుబడిదారులను బంగారం, వెండివైపు ఆకర్షిస్తున్నాయి. ఈ పరిస్థితులు కొనసాగితే సమీప కాలంలోనూ ధరలు అధికంగానే కొనసాగే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.