అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jan 25 Gold Prices | బంగారం, వెండి ధరలు Silver Prices రోజుకో కొత్త రికార్డును సృష్టిస్తూ సామాన్యులను, పెట్టుబడిదారులను ఒక్కసారిగా ఆలోచనలో పడేస్తున్నాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, అంతర్జాతీయ మార్కెట్లలో ఒడుదుడుకులు, రూపాయి విలువ బలహీనపడటం, అలాగే ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొనుగోళ్లు చేయడం వంటి అంశాలు కలిసి పసిడి–వెండి ధరలను ఆకాశానికి ఎత్తేస్తున్నాయి.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో శనివారం బంగారం, వెండి ధరలు మరోసారి భగ్గుమన్నాయి. మేలిమి బంగారం ధర ఏకంగా రూ.3 వేల వరకు పెరగగా, కిలో వెండి ధర రూ.5 వేల వరకు పెరిగింది. ఈ ధరల పెరుగుదలతో ఆభరణాల కొనుగోలుదారులు షాక్‌కు గురవుతున్నారు.
Jan 25 Gold Prices | వెండి ధరలు కూడా రికార్డు స్థాయిలో
గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో Hyerabad 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,260గా ఉంది. 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,900కు చేరింది. విజయవాడ, విశాఖపట్నం (వైజాగ్) నగరాల్లో కూడా దాదాపు ఇదే రేట్లు కొనసాగుతున్నాయి. అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పసిడి ధరలు సమాన స్థాయిలో ట్రేడవుతున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పరుగులు పెడుతున్నాయి.
ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.3,65,000 వద్ద ట్రేడవుతోంది. వైజాగ్, విజయవాడల్లో కూడా ఇదే స్థాయి ధరలు కొనసాగుతున్నాయి. అయితే ముంబై, ఢిల్లీలాంటి ప్రధాన నగరాల్లో మాత్రం వెండి ధర కాస్త తక్కువగా, రూ.3,35,000 పరిధిలో ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి–వెండి ధరలు బలంగా కొనసాగుతున్నాయి. ఔన్స్ 24 క్యారెట్ బంగారం ధర సుమారు 4982 డాలర్లు, ఔన్స్ వెండి ధర సుమారు 103 డాలర్లు వద్ద ట్రేడవుతోంది. ఈ అంతర్జాతీయ ధరల ప్రభావం నేరుగా దేశీయ మార్కెట్‌పై పడుతుండటంతో భారత్‌లో కూడా బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి.
మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం.. రాబోయే రోజుల్లోనూ బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్లోబల్ రాజకీయ ఉద్రిక్తతలు తగ్గకపోతే, అలాగే కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు కొనసాగితే పసిడి ధరలు Gold Rates కొత్త స్థాయిలను తాకే అవకాశముందని చెబుతున్నారు.