అక్షరటుడే, వెబ్డెస్క్: Jan 24 Horoscope | గ్రహ స్థితులను అనుసరించి నేడు (శనివారం, జనవరి 24) ద్వాదశ రాశుల్లో పలువురికి ఆర్థికంగా అద్భుతమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. మరికొన్ని రాశుల వారు ఆరోగ్యం, ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని గ్రహగతి సూచిస్తోంది.
మేష రాశి: Jan 24 Horoscope | ఇంట్లో కొన్ని శుభకార్యాలు, కార్యక్రమాల వల్ల ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. పిల్లల విజయాలు ఎంతో సంతోషాన్ని, గర్వాన్ని కలిగిస్తాయి. వారి వల్ల సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఎవరైనా మీ అభిప్రాయం అడిగితే మొహమాటపడకుండా స్పష్టంగా చెప్పండి. మీ ఆలోచనలకు మంచి ప్రశంసలు దక్కుతాయి.
వృషభ రాశి: Jan 24 Horoscope | చాలా కాలంగా పెండింగులో ఉన్న బాకీలు వసూలు అవుతాయి. దీనివల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చాలా రోజులుగా వాయిదా వేస్తున్న పనులను ఇవాళ పూర్తి చేస్తారు. పక్కా ప్రణాళికతో పనులు మొదలుపెట్టి సక్సెస్ అవుతారు.
మిథున రాశి: Jan 24 Horoscope | వ్యాపారస్తులకు తమ ప్రాణ స్నేహితుడి వల్ల ఆర్థికంగా లాభాలు కలిగే అవకాశం ఉంది. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. భవిష్యత్తు ప్రణాళికల విషయంలో కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఇవాళ సామాజిక లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కర్కాటక రాశి: Jan 24 Horoscope | ఏదైనా పనిలో వైఫల్యం ఎదురైనా నిరాశ పడకండి, ఓపికతో ఉండండి. భవిష్యత్తు కోసం మంచి ప్లాన్స్ వేయడానికి ఇవాళ చాలా అనుకూలంగా ఉంటుంది. మీలో ఉన్న మంచి గుణాల గురించి ఇంట్లోని పెద్దలు గొప్పగా చర్చించుకుంటారు. మీ చురుకైన మేధస్సుతో కొత్త విషయాలను చాలా వేగంగా గ్రహిస్తారు.
సింహ రాశి: గతంలో తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల ఆర్థిక పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా మారవచ్చు. మీ తెలివితేటలు, హాస్య చతురతతో చుట్టూ ఉన్నవారిని ఆకట్టుకుంటారు. గొప్ప వ్యక్తుల ఆత్మకథలను చదవడం వల్ల మీ ఆలోచనలు మెరుగుపడతాయి. మీ లక్ష్యాల పట్ల మీకు మరింత స్పష్టత, పట్టుదల పెరుగుతాయి.
కన్యా రాశి: వ్యాపారస్తులకు, ట్రేడింగ్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కోపతాపాలు ప్రదర్శించకండి, అది మీ మనశ్శాంతిని పాడు చేస్తుంది. ఎవరికైనా స్వచ్ఛందంగా సహాయం చేయండి. ఇలా చేయడం వల్ల సహాయం పొందినవారికే కాదు, మీకు కూడా భవిష్యత్తులో ఎంతో సానుకూలత, ఆత్మ తృప్తి లభిస్తాయి.
తులా రాశి:ఇవాళ గ్రహ స్థితి మీకు అనుకూలంగా ఉంది. మీరు చేసే పనులు విజయవంతమై మంచి ఫలితాలనిస్తాయి. పాత స్నేహితుడిని కలవడం వల్ల పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి. అందరూ చెప్పే విషయాలను శ్రద్ధగా వినండి. వాటిలోనే మీ సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి: నిరుత్సాహానికి లేదా నిరాశకు లోనుకాకండి. సానుకూల దృక్పథంతో ఉండటానికి ప్రయత్నించండి. స్నేహితులతో కలిసి బయటకు వెళ్లినప్పుడు ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ ప్రియమైన వారు ఏదో విషయంలో చిరాకుగా ఉండవచ్చు, ఇది మీకు కాస్త ఒత్తిడిని కలిగిస్తుంది.
ధనుస్సు రాశి: ఎవరి మాటలో నమ్మి ఇవాళ పెట్టుబడులు పెట్టకండి. ఇతరుల సలహాల వల్ల ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. సంగీతం వినడం, ఏదైనా వాయిద్యం వాయించడం ద్వారా మీ మనసు ఉల్లాసంగా మారుతుంది.
మకర రాశి: ఇవాళ మీరు చాలా ఉత్సాహంగా, శక్తివంతంగా ఉంటారు. మీ పనులను ఎప్పటికంటే చాలా వేగంగా, తక్కువ సమయంలోనే పూర్తి చేస్తారు. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. వ్యాపార అప్పుల కోసం వచ్చేవారిని సున్నితంగా తిరస్కరించడం మంచిది. పని ఒత్తిడి వల్ల మానసిక ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది.
కుంభ రాశి: డబ్బు ఆదా చేయాలనే ప్రయత్నాలు ఫలిస్తాయి. విజయవంతంగా ధనాన్ని పొదుపు చేయగలుగుతారు. వ్యాపారస్తులకు, ట్రేడింగ్ రంగంలో ఉన్నవారికి కలిసి వస్తుంది. ఆశించిన లాభాలు పొందే అవకాశం ఉంది.
మీన రాశి: గతంలో మీరు చేసిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు అందుతాయి. దీనివల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త ఆలోచనలు, ఏదైనా నేర్చుకోవాలనే కుతూహలం ఇవాళ విజయాన్ని అందిస్తాయి. కుటుంబంలో ఆనందం, ప్రశాంతత కోసం.. “దుర్గా సప్తశతి” పారాయణం చేయడం చాలా మంచిది.