అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jan 21 Horoscope : గ్రహ సంచారం ప్రకారం నేడు (మంగళవారం, జనవరి 21) పలు రాశుల వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. మరికొన్ని విషయాల్లో అద్భుతమైన విజయాలు లభిస్తాయి. కొందరికి పాత వ్యాపారాల నుంచి లాభాలు అందుతాయి. మరికొందరికి ఆకస్మిక తనిఖీలు, పని ఒత్తిడి వల్ల ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఆఫీసులో పై అధికారుల మద్దతు లభిస్తుంది. అయితే సహోద్యోగులతో వ్యవహరించేటప్పుడు వస్తువుల పట్ల, మాటల పట్ల జాగ్రత్త అవసరం.
మేష రాశి: Jan 21 Horoscope : ఆర్థికంగా ఇవాళ అంతగా కలిసి రాకపోవచ్చు. కాబట్టి, డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఆఫీసులో పై అధికారులు మీ పట్ల చాలా సానుకూలంగా ఉంటారు. మీ పనికి ప్రశంసలు దక్కవచ్చు. రోజు చివరలో చిన్న చిన్న విభేదాలు, గొడవలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరితోనూ వాదించకండి.
వృషభ రాశి: Jan 21 Horoscope : అదనంగా డబ్బు సంపాదించాలనుకుంటే, రిస్క్ లేని సురక్షితమైన పథకాలలో మాత్రమే పెట్టుబడి పెట్టండి. ఆఫీసులో పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇవాళ ఆకస్మిక తనిఖీలు జరిగే అవకాశం ఉంది, మీ తప్పుల వల్ల ఇబ్బందులు రావచ్చు. స్నేహితులు, సన్నిహితులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది.
మిథున రాశి: Jan 21 Horoscope : అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కొత్తగా డబ్బు సంపాదించే మార్గాలు కనిపిస్తాయి. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కొత్తగా భాగస్వామ్య వ్యాపారం మొదలుపెట్టడానికి ఇది మంచి సమయం. దీనివల్ల అందరికీ లాభాలు వస్తాయి. అయితే, ఎవరితోనైనా చేతులు కలిపే ముందు ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
కర్కాటక రాశి: Jan 21 Horoscope : స్నేహితుల్లో ఒకరు వారి వ్యక్తిగత సమస్యల గురించి మీ సలహా కోరవచ్చు. ఇవాళ మీకు డబ్బు విలువ తెలుస్తుంది. మీరు ఆశించినంత డబ్బు చేతికి అందకపోవచ్చు, కాబట్టి ఖర్చుల విషయంలో ఆచితూచి అడుగు వేయండి.
సింహ రాశి: ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం దెబ్బతినడం వల్ల ఖర్చులు పెరగవచ్చు. మీ ప్రవర్తన వల్ల అందరూ మీతో స్నేహం చేయడానికి ఇష్టపడతారు. ఆఫీసులో ఇవాళ మంచి పురోగతి కనిపిస్తుంది. పై అధికారుల ప్రశంసలు లేదా ఎదుగుదలకు అవకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మికంగా, శారీరకంగా ఫిట్‌గా ఉండటానికి ధ్యానం , యోగా చేయండి.
కన్యా రాశి: అనుకోని మార్గాల ద్వారా డబ్బు అందుతుంది. దీనివల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడి, రోజంతా సంతోషంగా ఉంటారు. బంధువులు మీకు ఇష్టమైన బహుమతులు ఇచ్చి ఆశ్చర్యపరుస్తారు. మీరు తీసుకునే ధైర్యవంతమైన నిర్ణయాలు ఇవాళ మంచి ఫలితాలను ఇస్తాయి. కొత్త విషయాలు నేర్చుకోవడం వల్ల మీ జ్ఞానం పెరుగుతుంది.
తులా రాశి: గతంలో సాధించిన విజయాలు ఇవాళ కొత్త ఉత్సాహాన్ని, నమ్మకాన్ని నింపుతాయి. డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు కనిపిస్తాయి. అవి చాలా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. ఆఫీసులో మీ పనితీరును మెరుగుపరుచుకోవడానికి కొత్త పద్ధతులు లేదా టెక్నిక్స్ నేర్చుకుంటారు. ఇది భవిష్యత్తు ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది.
వృశ్చిక రాశి: మీరు చేసే పనికి ఆఫీసులో మంచి గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. స్నేహితులతో సమయం గడపడం వల్ల మనశ్శాంతి, ఆనందం లభిస్తాయి. ఆఫీసులో మీ వస్తువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. సహోద్యోగుల వల్ల మీ విలువైన వస్తువులు పోయే ప్రమాదం ఉంది.
ధనుస్సు రాశి: ఆఫీసులో మీ తోటి ఉద్యోగులు మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటారు. పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభించి, సొంత పనులపై దృష్టి పెట్టగలుగుతారు. ఖాళీ సమయంలో ఏదైనా కొత్తగా లేదా సృజనాత్మకమైన పనులు చేయడానికి ప్రయత్నిస్తారు.
మకర రాశి: సమాజంలో మంచి గుర్తింపు ఉన్న వ్యక్తుల సహకారం లభిస్తుంది. ఇది మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. వ్యాపారస్తులకు, ట్రేడింగ్ చేసే వారికి ఇవాళ మంచి లాభాలు వస్తాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి అవుతాయి. కొత్త ప్రాజెక్టులు లేదా పనులు మొదలుపెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు.
కుంభ రాశి: కొత్తగా పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరో చెప్పారని కాకుండా, ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి లేదా విద్యా సంబంధిత ప్రయాణాలు చేయడానికి ఇది మంచి సమయం. బంధువుల వల్ల మీకూ, జీవిత భాగస్వామికీ మధ్య చిన్నపాటి గొడవలు వచ్చే అవకాశం ఉంది.
మీన రాశి: చిన్న వ్యాపారాలు చేసే వారికి ఇవాళ చాలా బాగుంటుంది. మీ సన్నిహితులు, స్నేహితులు ఇచ్చే సలహాల వల్ల మంచి లాభాలు వస్తాయి. విద్యార్థులకు, వ్యాపారస్తులకు ఇవాళ కలిసి వస్తుంది. అనుకున్న పనులు సజావుగా సాగుతాయి. ఉద్యోగంలో సంతృప్తి కలగాలన్నా, వృత్తిలో అభివృద్ధి సాధించాలన్నా, శ్రీ గణపతి సహస్రనామ పారాయణం చేయండి.