అక్షరటుడే, హైదరాబాద్: Jan 2 Gold Prices | జనవరి 1న న్యూ ఇయర్ సందర్భంగా అనేక అంతర్జాతీయ మార్కెట్లకు సెలవు Holiday ఉండటంతో ట్రేడింగ్ నెమ్మదిగా సాగింది. దీని ప్రభావంగా బంగారం, వెండి ధరల్లో పెద్దగా హెచ్చుతగ్గులు లేకుండా స్వల్ప మార్పులే నమోదయ్యాయి. భారత మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా పెరగగా, వెండి ధర మాత్రం కొద్దిగా తగ్గింది.
గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ సమాచారం ప్రకారం శుక్రవారం ఉదయం 6.30 గంటల సమయంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,070గా ఉండగా, 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,810కు చేరింది. మరోవైపు వెండి ధరలో వరుసగా నాలుగో రోజూ తగ్గుదల కొనసాగింది. నిన్న ఇదే సమయంతో పోలిస్తే కిలో వెండి ధర స్వల్పంగా తగ్గి రూ.2,37,900గా నమోదైంది. గతేడాది బంగారం, వెండిపై పెట్టుబడులు ఇన్వెస్టర్లకు అద్భుతమైన లాభాలను అందించాయి. 2025లో బంగారం ధర సుమారు 80 శాతం పెరగగా, వెండి ధర దాదాపు 150 శాతం వరకు ఎగబాకి కళ్లు చెదిరే రాబడులను ఇచ్చింది.
Jan 2 Gold Prices | ధరలు ఎలా ఉన్నాయంటే..
ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో కూడా ఇదే తరహా ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర Gold Rates 4,500 నుంచి 4,700 డాలర్ల మధ్య కదలాడవచ్చని పలు అంతర్జాతీయ బ్యాంకులు అంచనా వేయగా, ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 4,353 డాలర్ల వద్ద, వెండి ఔన్స్ ధర 72 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే..
- చెన్నైలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం రూ.1,36,130గా – 22 క్యారెట్ రూ.1,24,390గా – 18 క్యారెట్ రూ.1,03,740గా ఉంది.
- ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, కేరళ, పుణెల్లో 24 క్యారెట్ బంగారం రూ.1,35,070గా – 22 క్యారెట్ రూ.1,23,810గా – 18 క్యారెట్ రూ.1,01,300గా నమోదైంది.
- న్యూఢిల్లీలో Delhi 24 క్యారెట్ రూ.1,35,220గా – 22 క్యారెట్ రూ.1,23,960గా – 18 క్యారెట్ రూ.1,01,450గా ఉంది.
- వడోదరా, అహ్మదాబాద్‌లలో 24 క్యారెట్ రూ.1,35,120గా – 22 క్యారెట్ రూ.1,23,860గా – 18 క్యారెట్ రూ.1,01,350గా ఉంది.
వెండి ధరల విషయానికి వస్తే చెన్నైలో కిలో వెండి ధర రూ.2,55,900గా ఉండగా, ముంబై, న్యూఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, పుణె, వడోదరా, అహ్మదాబాద్‌లలో రూ.2,37,900గా నమోదైంది. హైదరాబాద్, విజయవాడ, కేరళలో మాత్రం కిలో వెండి ధర రూ.2,55,900గా ఉంది. మొత్తం మీద అంతర్జాతీయ మార్కెట్ల సెలవుల కారణంగా ట్రేడింగ్ మందగించినప్పటికీ, బంగారం స్వల్ప లాభంతో, వెండి స్వల్ప నష్టంతో కొత్త ఏడాదిని ప్రారంభించాయి.