అక్షరటుడే, న్యూఢిల్లీ: Jan 08 Market Analysis | యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్(Trump) చర్యలతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దీంతో మార్కెట్లు అస్థిరతకు లోనవుతున్నాయి. యూఎస్, యూరోపియన్ మార్కెట్లు(European markets) మిక్స్‌డ్‌గా ముగియగా.. ఆసియాలోని ప్రధాన స్టాక్ మార్కెట్లు సైతం ఒత్తిడికి గురవుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) నెగెటివ్‌గా ఉండటంతో మన మార్కెట్లూ గ్యాప్‌డౌన్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Jan 08 Market Analysis | యూఎస్ మార్కెట్లు..
వాల్‌స్ట్రీట్(Wallstreet) మిక్స్‌డ్‌గా ముగిసింది. జేపీ మోర్గాన్, బ్లాక్ స్టోన్ వంటి ఆర్థిక సంస్థలలో ప్రాఫిట్ బుకింగ్‌తో ఎస్‌అండ్‌పీ నష్టపోగా.. ఏఐ సంబంధిత స్టాక్‌లలో కొనుగోళ్లతో నాస్‌డాక్ మాత్రం లాభపడింది. గత సెషన్‌లో నాస్‌డాక్(Nasdaq) 0.12 శాతం పెరగ్గా.. ఎస్‌అండ్‌పీ 0.34 శాతం నష్టపోయింది. గురువారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.14 శాతం లాభంతో ఉంది.
Jan 08 Market Analysis | యూరోప్ మార్కెట్లు..
డీఏఎక్స్(DAX) 0.92 శాతం లాభపడగా.. ఎఫ్‌టీఎస్‌ఈ 0.74 శాతం, సీఏసీ 0.04 శాతం నష్టపోయాయి.
Jan 08 Market Analysis | ఆసియా మార్కెట్లు..
ఉదయం 8 గంటల ప్రాంతంలో సౌత్‌కొరియా మార్కెట్ మినహా మిగిలిన ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాలతో సాగుతున్నాయి. సౌత్ కొరియాకు చెందిన కోస్పీ(Kospi) 1.03 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.30 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.21 శాతం లాభంతో ఉన్నాయి. హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్(HangSeng) 1.46 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.59 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.10 శాతం నష్టాలతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.14 శాతం నష్టంతో సాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు సైతం నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్‌ఐఐ(FII)లు వరుసగా మూడో సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 1,527 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. డీఐఐలు వరుసగా 92వ రోజు నికర కొనుగోలుదారులుగా ఉండి రూ. 2,889 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 0.92 నుంచి 0.89 కు తగ్గింది.
- విక్స్(VIX) గత సెషన్‌లో 0.67 శాతం తగ్గి 9.95కు తగ్గింది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 29 పైసలు బలపడి 89.88 వద్ద నిలిచింది.
- యూఎస్ పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.15 శాతం వద్ద, డాలర్ ఇండెక్స్ 98.75 వద్ద కొనసాగుతున్నాయి.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 60.34 డాలర్ల వద్ద ఉంది.
- ట్రంప్ విధించిన రెసిప్రోకల్ టారిఫ్స్ హేతుబద్ధత విషయంలో రేపు(శుక్రవారం) యూఎస్ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ తీర్పు కోసం మార్కెట్లు వేచి చూస్తున్నాయి. టారిఫ్స్‌కు వ్యతిరేకంగా తీర్పు వస్తే మన మార్కెట్లు పరుగులు తీసే అవకాశాలున్నాయి.