అక్షరటుడే, హైదరాబాద్: Jan 08 Gold Prices | వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు Gold Prices గురువారం స్వల్ప ఉపశమనం కలిగిస్తూ కాస్త తగ్గడం జరిగింది. అయితే వెండి మాత్రం తన జోరును కొనసాగిస్తూ గురువారం కూడా పెరుగుతూ పోతోంది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితులు కొనసాగుతుండటంతో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్నారు.
ఈ పరిస్థితుల్లో బంగారం, వెండిపై మదుపర్లు ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. అలాగే డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణిస్తుండటం కూడా దేశీయంగా పసిడి, వెండి డిమాండ్ పెరగడానికి మరో కారణంగా మారింది. ఈ నేపథ్యంలో జనవరి 8వ తేదీ ఉదయం 6:30 గంటల సమయంలో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,38,260కి చేరగా, 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,26,740గా నమోదైంది.
Jan 08 Gold Prices | వెండి జోరు..
- దేశ రాజధాని ఢిల్లీలో Delhi 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,39,640గా ఉండగా, 22 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర రూ. 1,28,010కి చేరుకుంది.
- ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, కేరళ, పుణె వంటి నగరాల్లో కూడా 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,38,260గా , 22 క్యారెట్ల పది గ్రాముల ధర రూ. 1,26,740గా కొనసాగుతోంది.
- వడోదరలో మాత్రం 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,39,540గా , 22 క్యారెట్ల ధర రూ. 1,27,910గా నమోదైంది.
ఇక వెండి ధరల విషయానికి వస్తే, నిన్నటితో పోలిస్తే కిలోకు సుమారు రూ. 100 పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, కేరళలో Kerala కిలో వెండి ధర రూ. 2,77,100గా ఉండగా, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, వడోదర, అహ్మదాబాద్‌లలో కిలో వెండి ధర రూ. 2,57,100గా కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, రూపాయి మారకం విలువలో మార్పులు తదితర అంశాలు రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరలపై మరింత ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.