అక్షరటుడే, న్యూఢిల్లీ: Jan 07 Market Analysis | యూఎస్, యూరోపియన్ మార్కెట్లు పాజిటివ్‌గా ఉన్నా.. చైనా, జపాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండడంతో ఆసియాలోని ప్రధాన స్టాక్ మార్కెట్లు ఒత్తిడికి గురవుతున్నాయి. దీంతో మన మార్కెట్లూ నెగెటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Jan 07 Market Analysis | యూఎస్ మార్కెట్లు..
వెనిజువెలాలోని చమురు నిల్వలను అమెరికా(America) కంపెనీలు పొందే అవకాశం ఉండడంతోపాటు ఏఐ షేర్లలో ర్యాలీతో వాల్‌స్ట్రీట్ మరో రోజును సానుకూలంగా ముగించింది. గత సెషన్‌లో నాస్‌డాక్(Nasdaq) 0.67 శాతం, ఎస్‌అండ్‌పీ 0.64 శాతం పెరిగాయి. బుధవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.27 శాతం లాభంతో ఉంది.
Jan 07 Market Analysis | యూరోప్ మార్కెట్లు..
ఎఫ్‌టీఎస్‌ఈ 1.17 శాతం, సీఏసీ 0.31 శాతం, డీఏఎక్స్(DAX) 0.09 శాతం లాభపడ్డాయి.
Jan 07 Market Analysis | ఆసియా మార్కెట్లు..
ఉదయం 8 గంటల ప్రాంతంలో సౌత్‌కొరియా మార్కెట్ మినహా మిగిలిన ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాలతో సాగుతున్నాయి. హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్(HangSeng) 0.90 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.68 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.52 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.04 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.03 శాతం నష్టాలతో ఉన్నాయి. సౌత్ కొరియాకు చెందిన కోస్పీ(Kospi) 1.06 శాతం లాభంతో ఉంది. గిఫ్ట్ నిఫ్టీ 0.27 శాతం నష్టంతో సాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు సైతం నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్‌ఐఐ(FII)లు గత సెషన్‌లో నికరంగా రూ. 107 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. డీఐఐలు వరుసగా 91వ రోజు నికర కొనుగోలుదారులుగా ఉండి రూ. 1,749 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 1.00 నుంచి 0.92 కు తగ్గింది.
- విక్స్(VIX) గత సెషన్‌లో 0.05 శాతం తగ్గి 10.02కు చేరింది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 8 పైసలు బలపడి 90.17 వద్ద నిలిచింది.
- యూఎస్ పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.17 శాతం వద్ద, డాలర్ ఇండెక్స్ 98.52 వద్ద కొనసాగుతున్నాయి.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 60.12 డాలర్ల వద్ద ఉంది.