అక్షరటుడే, హైదరాబాద్: Jan 07 Gold Prices | వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు Silver Rates బుధవారం కూడా స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. అంతర్జాతీయంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, ఆర్థిక మార్కెట్లలో అస్థిరత కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో బంగారం, వెండికి డిమాండ్ మరింత పెరిగింది.
మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడటం కూడా దేశీయంగా పసిడి, వెండి ధరలు ఎగబాకడానికి ప్రధాన కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఈ రోజు (జనవరి 7) ఉదయం 6:30 గంటల సమయంలో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,38,830కి చేరింది. అదే విధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,27,260గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,38,980కి చేరగా – 22 క్యారెట్ల బంగారం రూ. 1,27,410 వద్ద ట్రేడ్ అవుతోంది.
Jan 07 Gold Prices | క్రమంగా పెరిగిన ధరలు..
దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా దాదాపు ఇదే స్థాయిలో బంగారం ధరలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు విజయవాడ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, కేరళ, పుణెలో Pune 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,38,830 – 22 క్యారెట్ల ధర రూ. 1,27,260గా ఉంది. వడోదరలో స్వల్ప తేడాతో 24 క్యారెట్ల బంగారం రూ. 1,38,880 – 22 క్యారెట్ల బంగారం రూ. 1,27,310గా నమోదైంది.
వెండి ధరలు కూడా అదే బాటలో కొనసాగుతున్నాయి. నిన్నటితో పోల్చితే కిలో వెండిపై సుమారు రూ. 100 మేర పెరుగుదల కనిపించింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, కేరళలో కిలో వెండి ధర రూ. 2,71,100గా ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, వడోదర, అహ్మదాబాద్‌లలో కిలో వెండి ధర రూ. 2,53,100గా నమోదైంది.
ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగితే సమీప కాలంలో బంగారం, వెండి ధరలు ఇదే స్థాయిలో లేదా మరింత ఎగబాకే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్, పండుగల Festivals డిమాండ్ నేపథ్యంలో దేశీయంగా పసిడి మార్కెట్ మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. పెట్టుబడిదారులు మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.