Jan 06 market Analysis | గ్రీన్‌లో గ్లోబల్‌ మార్కెట్లు.. పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

అక్షరటుడే, న్యూఢిల్లీ: Jan 06 market Analysis | ప్రధాన గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) పాజిటివ్‌గా సాగుతున్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ సైతం లాభాల బాటలో ఉంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు కూడా గ్యాప్‌అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. Jan 06 market Analysis | యూఎస్‌ మార్కెట్లు.. వెనిజువెలా అధ్యక్షుడిని అమెరికా అదుపులోకి తీసుకున్న తర్వాత చమురు మౌలిక సదుపాయాల పునర్నిర్మాణంపై ఆశలు చిగురించాయి. ఆయిల్‌, ఎనర్జీ కంపెనీలు వాల్‌స్ట్రీట్‌లో ర్యాలీకి నాయకత్వం వహించాయి. గత సెషన్‌లో నాస్‌డాక్‌(Nasdaq) […]

అక్షరటుడే, న్యూఢిల్లీ: Jan 06 market Analysis | ప్రధాన గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) పాజిటివ్‌గా సాగుతున్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ సైతం లాభాల బాటలో ఉంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు కూడా గ్యాప్‌అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Jan 06 market Analysis | యూఎస్‌ మార్కెట్లు..

వెనిజువెలా అధ్యక్షుడిని అమెరికా అదుపులోకి తీసుకున్న తర్వాత చమురు మౌలిక సదుపాయాల పునర్నిర్మాణంపై ఆశలు చిగురించాయి. ఆయిల్‌, ఎనర్జీ కంపెనీలు వాల్‌స్ట్రీట్‌లో ర్యాలీకి నాయకత్వం వహించాయి. గత సెషన్‌లో నాస్‌డాక్‌(Nasdaq) 0.67 శాతం, ఎస్‌అండ్‌పీ 0.64 శాతం పెరిగాయి. మంగళవారం ఉదయం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ 0.19 శాతం లాభంతో ఉంది.

Jan 06 market Analysis | యూరోప్‌ మార్కెట్లు..

డీఏఎక్స్‌(DAX) 1.32 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.53 శాతం, సీఏసీ 0.20 శాతం లాభపడ్డాయి.

Jan 06 market Analysis | ఆసియా మార్కెట్లు..

ఉదయం 7.50 గంటల ప్రాంతంలో సౌత్‌కొరియా మార్కెట్‌ మినహా మిగిలిన ప్రధాన ఆసియా మార్కెట్లు Asian Markets లాభాలతో సాగుతున్నాయి. హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్‌(HangSeng) 1.65 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.92 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్‌ టైమ్స్‌ 0.82 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.63 శాతం, తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 0.57 శాతం లాభాలతో ఉన్నాయి. సౌత్‌ కొరియాకు చెందిన కోస్పీ 0.37 శాతం నష్టంతో ఉంది. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) 0.30 శాతం లాభంతో సాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు గ్యాప్‌అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్‌ఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 36 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు. డీఐఐ(DII)లు వరుసగా 90వ రోజు నికర కొనుగోలుదారులుగా ఉండి రూ. 1,764 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు.
  • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 1.46 నుంచి 1.00 కు తగ్గింది.
  • విక్స్‌(VIX) గత సెషన్‌లో 6.06 శాతం పెరిగి 10.02కు చేరింది.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 8 పైసలు బలహీనపడి 90.28 వద్ద నిలిచింది.
  • యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 4.18 శాతం వద్ద, డాలర్‌ ఇండెక్స్‌ 98.29 వద్ద కొనసాగుతున్నాయి.
  • బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 61.52 డాలర్ల వద్ద ఉంది.

Related articles

February 23 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

February 23 Panchangam | తేదీ (DATE) – ఫిబ్రవరి 23,​ 2026 పంచాంగం (today horoscope) శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డికి మరో అరుదైన గౌరవం.. హార్వర్డ్​లో ప్రసంగించే అవకాశం!

అక్షరటుడే, హైదరాబాద్​: CM Revanth Reddy | తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Telangana Chief Minister Revanth Reddy కి అంతర్జాతీయ...

The Wedding of VIROSH : పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించిన విజయ్-రష్మిక.. ఎప్పుడంటే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: The Wedding of VIROSH | టాలివుడ్​ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక ఎట్టకేలకు తమ వివాహ బంధం వేడుకను ప్రకటించారు....

Flag march | బాన్సువాడలో ఫ్లాగ్​ మార్చ్​.. 19 మంది నిందితుల అరెస్టు

అక్షరటుడే, బాన్సువాడ: Flag march | కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను జిల్లా పోలీస్...