అక్షరటుడే, హైదరాబాద్: Jan 06 Gold Prices | అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు Silver Prices మరోసారి భారీగా పెరిగి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అమెరికా -వెనిజులా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడం, వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్ట్‌కు సంబంధించిన వార్తలు ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితిని పెంచాయి.
ఈ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు రిస్క్ తక్కువగా ఉండే సురక్షిత పెట్టుబడిగా బంగారాన్ని ఎంచుకోవడంతో అంతర్జాతీయంగా గోల్డ్‌కు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. దాని ప్రభావం నేరుగా భారత మార్కెట్‌పై పడటంతో దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి.
Jan 06 Gold Prices | మారుతున్న ధరలు..
దేశంలో ఈరోజు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,38,230లకు చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర Gold Prices రూ.1,26,710గా ఉంది. అలాగే 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,03,680 పలుకుతోంది.
- చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,39,210గా, 22 క్యారెట్ల ధర రూ.1,27,610గా నమోదైంది. అక్కడ వెండి కిలో ధర రూ.2,66,100గా ఉంది.
- ముంబైలో 24 క్యారెట్ల బంగారం రూ.1,38,230, 22 క్యారెట్ల బంగారం రూ.1,26,710గా ఉండగా, వెండి కిలో ధర రూ.2,48,100గా ఉంది.
- ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాములు రూ.1,38,380, 22 క్యారెట్ల బంగారం రూ.1,26,860గా ఉండగా, వెండి కిలో ధర రూ.2,48,100గా ఉంది.
- కోల్‌కతా, బెంగళూరు Bangalore నగరాల్లో కూడా 24 క్యారెట్ల బంగారం రూ.1,38,230, 22 క్యారెట్ల బంగారం రూ.1,26,710గా నమోదై, వెండి ధర కిలోకు రూ.2,48,100గా ఉంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాములు రూ.1,38,230, 22 క్యారెట్ల బంగారం రూ.1,26,710గా ఉండగా, వెండి కిలో ధర రూ.2,65,100గా ఉంది. ఈ ధరలు ఉదయం 8 గంటలలోపు అందిన సమాచారం ఆధారంగా మాత్రమేనని, అంతర్జాతీయ మార్కెట్ మార్పుల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు ఎప్పుడైనా మారవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.