అక్షరటుడే, హైదరాబాద్: Jan 04 Gold Prices | అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు Gold Prices స్థిరంగా కొనసాగుతున్న ప్రభావంతో దేశీయ మార్కెట్లో కూడా గోల్డ్ రేట్లు మార్పుల్లేకుండా ఉన్నాయి. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఆదివారం కూడా అదే స్థాయిలో కొనసాగడం గమనార్హం.
గత వారం ధరలు పడిపోవడంతో పండుగ సీజన్ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయాలనుకునే వినియోగదారుల్లో ఉత్సాహం పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ వారం ధరలు ఎలా ఉంటాయన్న చర్చ జోరుగా సాగుతున్న వేళ, ఆదివారం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు స్థిరంగా నమోదయ్యాయి.
Jan 04 Gold Prices | కొనుగోలుదారులకి ఊరట..
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,35,820గా కొనసాగుతుండగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,24,500 వద్ద నిలిచింది. విజయవాడలో కూడా ఇదే రేట్లు కొనసాగుతున్నాయి.
- బెంగళూరులో Bangalore 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,35,820గా – 22 క్యారెట్ల ధర రూ.1,24,500గా నమోదైంది.
- చెన్నైలో మాత్రం 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,37,460గా ఉండగా – 22 క్యారెట్ల ధర రూ.1,26,000 వద్ద కొనసాగుతోంది.
- ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,35,970గా ఉండగా – 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,24,650గా ఉంది.
ఇక వెండి ధరల విషయానికి వస్తే, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,41,000గా కొనసాగుతుండగా, హైదరాబాద్‌లో కేజీ వెండి రూ.2,57,000 వద్ద ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా హైదరాబాద్‌కు సమానమైన ధరలే కొనసాగుతున్నాయి.
2025లో, వెండి ధరలు అసాధారణంగా పెరిగి అందరు ఉలిక్కిపడేలా చేశాయి. డిమాండ్, సరఫరా మధ్య ఉన్న అసమతుల్యత కారణంగా 2025లో వెండి ధరలు దాదాపు 180 శాతం వరకు పెరగడం అందరిని షాక్‌కి గురి చేసింది. దేశీయ మార్కెట్లో కిలో వెండి ధరలు అప్పట్లో రూ.70 వేల స్థాయిల నుంచి రూ.1.25 లక్షల వరకు చేరడం జరిగింది.
ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ రంగాల్లో వెండికి డిమాండ్ భారీగా పెరగడం, వాటితో పాటు శామ్సంగ్ లిథియం-అయాన్ బ్యాటరీల నుంచి సాలిడ్-స్టేట్ బ్యాటరీల వైపు మారుతున్నట్లు ప్రకటించడంతో, వెండికి పారిశ్రామిక రంగంలో భారీ డిమాండ్ నెలకొంది. వెండిని కీలక ముడి పదార్థంగా భావించడంతో దాని ధరలు Rates ఆకాశాన్ని అంటుతున్నాయి.