అక్షరటుడే, న్యూఢిల్లీ: Jan 02 Market Analysis | ఆంగ్ల నూతన సంవత్సరం నేపథ్యంలో భారత్ మినహా మిగిలిన అన్ని ప్రధాన స్టాక్ మార్కెట్లు సెలవు తీసుకున్నాయి. శుక్రవారం ఉదయం డౌజోన్స్(Dow Jones) ఫ్యూచర్స్ మాత్రం 0.33 శాతం లాభంతో ఉంది. ఉదయం ఆసియా మార్కెట్లు లాభాలతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) సైతం లాభాలతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ గ్యాప్‌అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Jan 02 Market Analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు Asian markets లాభాలతో సాగుతున్నాయి. హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్(Hang Seng) 1.81 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 1.05 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.36 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.67 శాతం లాభాలతో ఉన్నాయి. న్యూ ఇయర్ సందర్శంగా జపాన్, చైనా(China) మార్కెట్లకు శుక్రవారం సైతం సెలవు. దీంతో అక్కడి మార్కెట్లు మూసి ఉన్నాయి. ఉదయం గిఫ్ట్ నిఫ్టీ 0.18 శాతం లాభంతో ఉంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు గ్యాప్‌అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Jan 02 Market Analysis | గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్ఐఐలు వరుసగా ఎనిమిదో సెషన్లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. గత సెషన్లో నికరంగా రూ. 3,268 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. డీఐఐ(DII)లు వరుసగా 88వ రోజు నికర కొనుగోలుదారులుగా ఉండి రూ. 1,525 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 1.27 నుంచి 1.13 కి పడిపోయింది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 8 పైసలు బలహీనపడి 89.96 వద్ద నిలిచింది.
- యూఎస్ పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.17 శాతం వద్ద, డాలర్ ఇండెక్స్ 98.16 వద్ద కొనసాగుతున్నాయి.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 60.98 డాలర్ల వద్ద ఉంది.
- వెనిజులా చమురు వాణిజ్యంతో ముడిపడి ఉన్న చైనా, హాంగ్‌కాంగ్‌లకు చెందిన నాలుగు కంపెనీలపై యూఎస్ ఆంక్షలు విధించింది.