అక్షరటుడే, వెబ్డెస్క్: JAN 02 horoscope | గ్రహాల గమనం నేడు (శుక్రవారం, జనవరి 02) చాలా రాశుల వారికి వృత్తి పరంగా అద్భుత ఫలితాలను కల్పిస్తోంది. ఆఫీసులో కష్టానికి తగిన గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. కొందరికి పదోన్నతులు, ఆర్థిక ప్రయోజనాలు కలిగే సూచనలు ఉన్నాయి.
మేష రాశి: JAN 02 horoscope | స్నేహితుల్లో ఒకరు వారి వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం మీ సలహాను అడుగుతారు. ఆఫీసులో కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. పదోన్నతి (Promotion), ఆర్థిక లాభాలు కలిగే అవకాశం ఉంది. ఇవాళ మీలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. దానిని మంచి పనుల కోసం ఉపయోగించండి.
వృషభ రాశి: JAN 02 horoscope | ఆఫీసులో చేసే పనికి అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఏదైనా ఒత్తిడి ఉంటే కుటుంబ సభ్యులతో పంచుకోండి. జీవితం సాఫీగా సాగాలంటే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది.
మిథున రాశి: JAN 02 horoscope | ఆకర్షణీయమైన మీ మాట తీరు, ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటాయి. కొత్త విషయాలు, టెక్నాలజీ నేర్చుకోవడానికి చిన్నపాటి కోర్సుల్లో చేరితే భవిష్యత్తులో లాభదాయకంగా ఉంటుంది. స్నేహితులు, బంధువుల నుంచి వచ్చే ఒక మంచి వార్తతో ఈరోజు ఉత్సాహంగా మొదలవుతుంది.
కర్కాటక రాశి: JAN 02 horoscope | ఇవాళ చేసే పెట్టుబడులు (Investment) భవిష్యత్తుకు భద్రతను, ఆర్థిక వృద్ధిని ఇస్తాయి. ఆఫీసులో మిమ్మల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టే వ్యక్తి, తన తెలివితేటలతో ఆశ్చర్యం కలిగిస్తాడు. సంతోషాన్ని తల్లిదండ్రులతో పంచుకోండి. వారు ఒంటరితనంతో, బాధలో ఉంటే.. వారితో సమయం గడిపి ఉత్సాహాన్ని నింపండి.
సింహ రాశి: ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వద్దు. కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావచ్చు. అటువంటప్పుడు నమ్మకమైన వ్యక్తుల సలహాలు తీసుకోండి. ఆఫీసులో మీరు చేసే పనికి పై అధికారుల నుంచి మెప్పు లభిస్తుంది.
కన్యా రాశి: గతంలో అనుకున్న కొన్ని ముఖ్యమైన ప్లాన్లు ఇవాళ అమలవుతాయి. దీనివల్ల మీకు కొత్తగా డబ్బు వచ్చే అవకాశం ఉంది. కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. ఉన్న బంధం మరింత బలపడవచ్చు. ఆఫీసులో మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పే విషయాలను అందరూ చాలా శ్రద్ధగా వింటారు.
తులా రాశి: అప్పు ఇచ్చిన వారు తిరిగి డబ్బులు అడగవచ్చు. చెల్లించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇది ఇంట్లో అందరినీ సంతోషంగా ఉంచుతుంది. ప్రేమ వ్యవహారాల్లో మీ ప్రయత్నాలు అంతగా ఫలించకపోవచ్చు.
వృశ్చిక రాశి: పిల్లల చదువుల కోసం, వారి అవసరాల కోసం కొంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కొత్త క్లయింట్లను ఆకట్టుకోవడానికి కనిపించే తీరులో తగిన మార్పులు చేసుకోండి. ఇది మీ వృత్తికి మేలు చేస్తుంది. జీవిత భాగస్వామి నుంచి ఒక అద్భుతమైన సర్ప్రైజ్ అందుకుంటారు.
ధనుస్సు రాశి: ఆరోగ్యం చాలా బాగుంటుంది. విదేశీ వ్యాపారం చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు తమ ప్రతిభను చాటుకుని అందరి మెప్పు పొందుతారు. పగలు చిన్నపాటి వాదనలు జరిగినప్పటికీ, సాయంత్రం అయ్యేసరికి ముగిసిపోతాయి. ఆర్థిక స్థితి మెరుగుపడటానికి , జీవితంలో పవిత్రత కోసం అచ్యుత, కేశవ, విష్ణు, హరి, సత్య, జనార్దన, హంస, నారాయణ నామాలను 11 సార్లు స్మరించండి.
మకర రాశి: ఇంటి అవసరాల కోసం మీ భాగస్వామితో కలిసి కొన్ని ఖరీదైన వస్తువులు కొంటారు. స్నేహితులు, బంధువుల నుంచి ఊహించని బహుమతులు అందుకుంటారు. ఖాళీ సమయాన్ని గుడికి వెళ్లడం, ఆధ్యాత్మిక పనుల్లో గడపడానికి ఇష్టపడతారు. దీనివల్ల అనవసర గొడవలకు దూరంగా ఉంటారు.
కుంభ రాశి: ఖర్చుల విషయంలో జీవిత భాగస్వామితో చిన్నపాటి గొడవలు వచ్చే అవకాశం ఉంది. మీరు చేసే ఒక చిన్న సాయం, మరొక వ్యక్తిని పెద్ద ప్రమాదం, దురదృష్టం నుంచి బయటపడేస్తుంది. ఆఫీసులో, వృత్తిలో మీ బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. పని భారం పెరిగినా సమర్థవంతంగా పూర్తి చేస్తారు.
మీన రాశి: పిల్లల చదువుల కోసం, భవిష్యత్తు అవసరాల కోసం కొంత డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. ఆఫీసులో మీదే పైచేయి అవుతుంది. అందరి దృష్టి మీపైనే ఉంటుంది. విజయం చాలా దగ్గరలో ఉంటుంది. రాజకీయాలకు, గొడవలకు దూరంగా ఉంటే మంచిది. పని ఒత్తిడి వల్ల మానసిక ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది.