అక్షరటుడే, న్యూఢిల్లీ: Jan 01 market analysis | ఆంగ్ల నూతన సంవత్సరం New Year నేపథ్యంలో భారత్(Bharath) మినహా మిగిలిన అన్ని ప్రధాన స్టాక్ మార్కెట్లకు సెలవు. ఈ రోజు ఆయా దేశాల స్టాక్ మార్కెట్లు మూసి ఉంటాయి. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) లాభాలతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ గ్యాప్‌అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
Jan 01 market analysis | యూఎస్ మార్కెట్లు..
వాల్‌స్ట్రీట్ వరుసగా నాలుగో సెషన్లోనూ నష్టాలతో ముగిసింది. గత సెషన్లో ఎస్అండ్పీ 0.74 శాతం, నాస్డాక్(Nasdaq) 0.71 శాతం నష్టపోయాయి. గురువారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ మాత్రం 0.17 శాతం లాభంతో ఉంది.
Jan 01 market analysis | యూరోప్ మార్కెట్లు..
ఎఫ్టీఎస్ఈ 0.65 శాతం, డీఏఎక్స్(DAX) 0.57 శాతం, సీఏసీ 0.46 శాతం లాభంతో ముగిశాయి.
Jan 01 market analysis | ఆసియా మార్కెట్లు..
ఆంగ్ల నూతన సంవత్సరం నేపథ్యంలో భారత్ మినహా మిగిలిన అన్ని ప్రధాన స్టాక్ మార్కెట్లకు సెలవు. గత సెషన్లో చైనాకు చెందిన షాంఘై 0.09 శాతం లాభపడగా.. హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్(HangSeng) 0.87 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.20 శాతం నష్టపోయాయి. తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫ్లాట్‌గా ముగిసింది. గురువారం ఉదయం 7.50 గంటల సమయంలో గిఫ్ట్ నిఫ్టీ 0.23 శాతం లాభంతో ఉంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు గ్యాప్‌అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్ఐఐ(FII)లు వరుసగా ఏడో సెషన్లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. గత సెషన్లో నికరంగా రూ. 3,597 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. డీఐఐలు వరుసగా 87వ రోజు నికర కొనుగోలుదారులుగా ఉండి రూ. 6,759 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 0.68 నుంచి 0.92కు పెరిగింది. పీసీఆర్ 0.7 పైన ఉండడం బుల్స్‌కు అనుకూలాంశం.
- విక్స్(VIX) గత సెషన్లో 0.44 శాతం తగ్గి 9.68 వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 7 పైసలు బలహీనపడి 89.87 వద్ద నిలిచింది.
- యూఎస్ పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.17 శాతం వద్ద, డాలర్ ఇండెక్స్ 98.32 వద్ద కొనసాగుతున్నాయి.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.89 శాతం తగ్గి 60.79 డాలర్ల వద్ద ఉంది.
- సెన్సెక్స్ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్పైరీ నేపథ్యంలో మార్కెట్లో ఒడిదుడుకులు ఉండొచ్చు.