అక్షరటుడే, హైదరాబాద్: Jan 01 Gold Prices | నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన వేళ ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చే వార్త వచ్చింది. వరుసగా మూడోసారి బంగారం ధరలు Gold Prices తగ్గాయి. యూఎస్ డాలర్ బలపడటం, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రాఫిట్ బుకింగ్ కొనసాగడం వల్ల పసిడి ధరలు దిగొస్తున్నాయి.
గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ సమాచారం ప్రకారం గురువారం జనవరి 1 ఉదయం 6.30 గంటల సమయంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,488గా నమోదైంది. గత మూడు రోజుల్లోనే దాదాపు రూ.5 వేల మేర ధర తగ్గడం గమనార్హం. అదే సమయంలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,640కు చేరింది. బంగారంతో పాటు వెండి ధరలోనూ తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,38,900గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో చూస్తే ఔన్స్ 24 క్యారెట్ బంగారం ధర 4,364.70 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
Jan 01 Gold Prices | 66 శాతం పెరుగుదల..
గతేడాదిలో బంగారం ధర దాదాపు 66 శాతం పెరగడం గమనార్హం. మరోవైపు ఔన్స్ వెండి ధర Silver Price 71.59 డాలర్ల వద్ద కదలాడుతుండగా.. ఈ ఏడాది వెండి ధరలు సుమారు 140 శాతం పెరిగినట్లు మార్కెట్ డేటా చెబుతోంది. ధరలు తగ్గుతున్న ఈ తరుణంలో మళ్లీ ఇన్వెస్టర్లు గోల్డ్ పెట్టుబడుల వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే..
- చెన్నైలో 24 క్యారెట్ రూ.1,36,140గా – 22 క్యారెట్ రూ.1,24,790గా – 18 క్యారెట్ రూ.1,04,090గా ఉన్నాయి.
- ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, కేరళ, పుణెలలో 24 క్యారెట్ రూ.1,34,880గా – 22 క్యారెట్ రూ.1,23,640గా – 18 క్యారెట్ రూ.1,01,160గా నమోదయ్యాయి.
- ఢిల్లీలో Delhi 24 క్యారెట్ రూ.1,35,030గా – 22 క్యారెట్ రూ.1,23,790గా – 18 క్యారెట్ రూ.1,01,320గా ఉంది.
- వడోదరా, అహ్మదాబాద్‌లలో 24 క్యారెట్ రూ.1,34,930గా – 22 క్యారెట్ రూ.1,23,690గా – 18 క్యారెట్ రూ.1,01,210గా ఉన్నాయి.
వెండి ధరల విషయానికి వస్తే చెన్నై, హైదరాబాద్, విజయవాడ, కేరళలో కిలో వెండి రూ.2,56,900గా ఉండగా, ముంబై, న్యూఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, పుణె, వడోదరా, అహ్మదాబాద్‌లలో రూ.2,38,900గా కొనసాగుతోంది. ధరల్లో ఈ తగ్గుదల కొత్త సంవత్సరంలో బంగారం, వెండిపై పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి అనుకూలంగా మారిందని ఆర్థిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.