అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jammu Kashmir earthquake జమ్మూ కాశ్మీర్లో సోమవారం ఉదయం 5.35 గంటలకు భూకంపం సంభవించింది. పలు ప్రాంతాల్లో ప్రకంపనలు రావడంరతో స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైంది. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) ప్రాథమిక డేటా ప్రకారం.. బుడ్గామ్ జిల్లాలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. 33.9°N – 74.76°E వద్ద 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైంది.
Jammu Kashmir earthquake : ప్రభావిత ప్రాంతాలు
భూకంపం సంభవించిన సమయంలో.. భూకంపం ప్రాంతంలో ఆకాశం మేఘావృతమై ఉంది. మైనస్ 0.9 డిగ్రీల సెల్సియస్‌తో అతి శీతల ఉష్ణోగ్రతలు ఉన్నాయి. గాలిలో 95 శాతం అధిక తేమ ఉంది. సెకనుకు 1 మీటర్ వేగంతో తేలికపాటి పశ్చిమ గాలి వీయడం గమనార్హం.
భూకంప కేంద్రానికి 4 కిలోమీటర్ల దక్షిణాన ఉన్న చరార్-ఇ-షరీఫ్, తూర్పున 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుల్వామా, 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీనగర్, షోపియన్లతో సహా సమీప ప్రాంతాలలో ప్రకంపనలు ఏర్పడ్డాయి.