అక్షరటుడే, వెబ్‌డెస్క్:Jammu Kashmir | జమ్మూ కశ్మీర్ మంత్రివర్గ సమావేశాన్ని మంగళవారం పహల్గామ్(Pahalgam)లో నిర్వహిస్తున్నారు. సాధారణంగా కేబినెట్ భేటీ సచివాలయంలో నిర్వహిస్తారు. కానీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Chief Minister Omar Abdullah) ఇటీవల ఉగ్రదాడి జరిగిన పహల్గామ్‌లో కేబినేట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. జమ్మూ కశ్మీర్ వేసవి రాజధాని శ్రీనగర్, శీతాకాల రాజధాని జమ్మూ ఉంటుంది. ఎప్పుడైనా ఈ రెండు ప్రాంతాల్లో మంత్రివర్గ సమావేశాలు జరుగుతాయి.
Jammu Kashmir | పర్యాటకుల్లో విశ్వాసం కల్పించేలా..
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు దాడి చేసి పర్యాటకులను చంపారు. దీంతో పహల్గామ్‌లో పర్యాటకం దెబ్బతింది. పర్యాటకుల(Tourists) సంఖ్య తగ్గిపోవడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారిలో విశ్వాసం కల్పించేలా పహల్గామ్‌లో మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఇటీవల నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న ఒమర్ అబ్దుల్లా పర్యాటకుల్లో విశ్వాసం పెంపొందించడానికి చర్యలు చేపడుతామని ప్రధాని మోదీ(Prime Minister Modi)కి తెలిపారు. ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు తొలగిస్తామన్నారు. ఈ క్రమంలో మంత్రివర్గ సమావేశం (Cabinet meeting) నిర్వహించనున్నారు. అయితే ఈ సమావేశంలో చర్చించే అంశాలపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు.
Jammu Kashmir | తగ్గిన పర్యాటకులు
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా పీవోకే, పాక్‌లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. ఇందులో వంద మంది వరకు ఉగ్రవాదులు చనిపోయారు. అనంతరం పాక్, భారత్‌పై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసింది. పాక్ దాడులను తిప్పి కొట్టిన భారత్ దాయాదీ దేశంలోని ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేసింది. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. తదనంతరం కాల్పుల విరమణ జరిగింది. అయినా.. ఉగ్రదాడి భయంతో జమ్మూకశ్మీర్‌కు పర్యాటకుల సంఖ్య తగ్గింది. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించినా పర్యాటకులు కశ్మీర్ వెళ్లడానికి భయపడుతున్నారు. ఈ క్రమంలోనే పర్యాటకుల్లో భయం పొగొట్టేలా జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం (Jammu and Kashmir Government) చర్యలు చేపట్టింది.