అక్షరటుడే, వెబ్డెస్క్ : National Highways | జాతీయ రహదారులు వాహనాల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ వైపు వెళ్లే రహదారులన్నీ “జామ్”జాటంగా కనిపిస్తున్నాయి.
దసరా, బతుకమ్మ పండుగల నేపథ్యంలో సొంతూళ్లకు తరలిన ప్రజలు తిరిగి హైదరాబాద్(Hyderabad)కు ప్రయాణమయ్యారు. ఈ నేపథ్యంలో నల్గొండ, కరీనంగర్, నిజామాబాద్ నుంచి మహా నగరానికి వెళ్లే రోడ్లపై వాహనాల రద్దీ తీవ్రంగా పెరిగింది. టోల్ ప్లాజాల వద్ద వందలాది వాహనాలు బారులు తీరడంతో ట్రాఫిక్ జామ్ అయింది.చౌటుప్పల్, పంతంగి, చిట్యాల, తూప్రాన్, ఇందల్వాయి టోల్‌ప్లాజాలతో పాటు రాజీవ్ రహదారిపై తీవ్ర ట్రాఫిక్ జామ్(Traffic Jam) ఏర్పడింది.
National Highways | సెలవులు ముగియడంతో..
దసరా పండుగ సందర్భంగా సెలవులు ప్రకటించడంతో హైదరాబాద్ వాసులు తమ ఊర్లకు వెళ్లారు. సెలవులు ముగియడంతో నగరవాసులు సొంతూళ్ల నుంచి తిరిగి హైదరాబాద్‌కు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో టోల్ ప్లాజా(Toll Plaza)ల వద్ద వాహనాల రద్దీ విపరీతంగా పెరిగి పోయింది. వాహనాలు ముందుకు కదలక పోవడంతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయ్యింది. శనివారం మధ్యాహ్నం నుండి ప్రారంభమైన రద్దీ సోమవారం కూడా కొనసాగింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
National Highways | బారులు తీరిన వాహనాలు..
సొంతూళ్లకు వెళ్లిన వారు నగరానికి చేరుకుంటుండడంతో టోల్ ప్లాజాల వద్ద రద్దీ పెరిగింది. వాహనాలు ముందుకు కదలకపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ – విజయవాడ 65 వ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది. చౌటుప్పల్‌లో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద రెండు కిలోమీటర్ల మేర రాకపోకలు నిలిచిపోయాయి. పంతంగి టోల్ ప్లాజా వద్ద రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. చౌటుప్పల్ నుండి రెడ్డిబావి వరకు మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. .