అక్షర టుడే, డిచ్‌పల్లి : Excise Department | మండలంలోని కలిగోట్(Kaligot) గ్రామ శివారులో అబ్కారీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమంగా నాటుసారా తరలిస్తున్న కారును నిఘావేసి పట్టుకున్నారు.
Excise Department | కారులో నాటుసారా తీసుకెళ్తుండగా..
సుమారు 30 లీటర్ల నాటు సారాను తరలిస్తున్న టాటా ఇండికా కారు(Tata Indica car)ను పట్టుకున్నారు. అనంతనం వాహనాన్ని సీజ్ చేశారు. నాటుసారాను తరలిస్తున్న కలిగోట గ్రామానికి చెందిన గండికోట అశోక్‌ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు ఆర్మూర్ అబ్కారీ శాఖ పోలీసులు(Excise Department Police) తెలిపారు. నాటుసారా తయారీ, అమ్మకాలు నిషిద్ధమని.. అమ్మినా.. నాటుసారా తరలించినా కేసులు నమోదు చేస్తామని ఈ సందర్భంగా ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.