అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ENGvIND | ఇంగ్లండ్‌తో జరుగుతున్న అండర్సన్–టెండూల్కర్ ట్రోఫీ (Anderson-Tendulkar Trophy) చివరి టెస్టు (ఓవల్ టెస్ట్)లో టీమిండియా బ్యాటర్లు అదరగొడుతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) (108 నాటౌట్) ఈసారి అద్భుతంగా రాణిస్తూ జట్టుకు తన వంతు సపోర్ట్ అందిస్తున్నాడు. నైట్‌వాచ్‌మన్‌గా వచ్చిన ఆకాశ్ దీప్ (66) అనుభవం ఉన్న ప్లేయర్‌లా ఆడి, యశస్వీకి అండగా నిలిచాడు. ఈ క్రమంలోనే కెరీర్‌లో తొలిసారి అర్ధ సెంచరీ నమోదు చేశాడు ఆకాశ్. ఓవర్‌నైట్ స్కోర్ 75/2తో మూడో రోజు ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్, మ్యాచ్‌ను తమ వైపునకు తిప్పుకునే దిశగా దూసుకెళ్తోంది.
ENGvIND | ఆకాశ్ అదరహో..
రెండో రోజు అర్ధశతకం బాదిన యశస్వీ మూడో రోజూ అదే జోరును కొనసాగించాడు. ఇంగ్లండ్ పేసర్లను ధైర్యంగా ఎదుర్కొంటూ, స్పెషల్ షాట్లతో బంతిని స్టాండ్స్‌కి పంపిస్తున్నాడు. స్లిప్ ఏరియాలో వచ్చిన బంతిని బౌండరీలుగా మలుస్తూ ఫీల్డర్లను తలపట్టుకునేలా చేస్తున్నాడు. జేమీ ఓవర్టన్, జోష్ టంగ్ బౌన్సర్లతో అటాక్ చేసినా.. ఆకాశ్ దీప్ (Akash Deep) ఓపికతో ఆడి పరుగులు చేశాడు. యశస్వీకి మంచి భాగస్వామిగా నిలిచిన ఆకాశ్, ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కు సెంచరీకు పైగా పరుగులు జోడించారు. అనంతరం 66 పరుగుల వద్ద ఆకాశ్ ఔట్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ గిల్(11) ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. కరుణ నాయర్ (17) పరుగులు చేసి వెనుదిరిగాడు. ప్రస్తుతం భారత్ 199/5 పరుగులు చేసింది. జైస్వాల్ తో పాటు రవీంద్ర జడేజా (2) క్రీజులో ఉన్నాడు. ఇండియా 212 పరుగుల ఆధిక్యంలో ఉంది.
అయితే ఈ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుని హాఫ్ సెంచరీ సాధించాడు. 40 పరుగుల వద్ద ఉన్నప్పుడు జోష్ టంగ్ (Tung) వేసిన 14వ ఓవర్లో ఒక షార్ట్ బంతిని ఫుల్ షాట్ ఆడటానికి ప్రయత్నించగా.. బంతి సరిగ్గా లాంగ్ లెగ్ దిశలో ఉన్న లియామ్ డాసన్ చేతుల్లోకి వెళ్లింది. ఇది సులభమైన క్యాచ్ అయినప్పటికీ డాసన్ దానిని మిస్ చేశాడు. అంతకముందు 20 పరుగుల వద్ద ఉన్నప్పుడు గస్ అట్కిన్సన్ బౌలింగ్‌లో జైస్వాల్ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో ఉన్న హ్యారీ బ్రూక్ వదిలేశాడు. దీంతో జైస్వాల్‌కి రెండు అవకాశాలు వచ్చినట్టైంది. అయితే ఈ రెండు అవకాశాల తర్వాత దూకుడును కొనసాగించిన జైస్వాల్ కేవలం 44 బంతుల్లోనే అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు.