HomeUncategorizedMinister Jaishankar | ట్రంప్ టారిఫ్‌ల‌కు జైశంక‌ర్ దీటైన స‌మాధానం.. న‌చ్చితే కొనండి.. లేక‌పోతే వ‌దిలేయండని...

Minister Jaishankar | ట్రంప్ టారిఫ్‌ల‌కు జైశంక‌ర్ దీటైన స‌మాధానం.. న‌చ్చితే కొనండి.. లేక‌పోతే వ‌దిలేయండని కౌంట‌ర్‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Minister Jaishankar | రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుంద‌న్న అక్క‌సుతో భార‌త్‌పై అమెరికా విధించిన టారిఫ్‌ల‌ను విదేశాంగ శాఖ మంత్రి జైశంక‌ర్ (Minister Jaishankar) తీవ్రంగా ఖండించారు. ర‌ష్యాతో వ్యాపారం చేయ‌డాన్ని త‌ప్పుబ‌డుతున్న అమెరికా, యూర‌ప్ దేశాల‌కు దిమ్మ‌తిరిగే రీతిలో ఆయ‌న స‌మాధానమిచ్చారు.

ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరం 2025లో శ‌నివారం ప్ర‌సంగించిన ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భార‌త ఉత్పత్తులు న‌చ్చితే కొనండి లేక‌పోతే వ‌దిలేయండని కౌంట‌ర్ ఇచ్చారు. జాతీయ ప్ర‌యోజ‌నాల‌కు అనుగుణంగానే త‌మ ప్ర‌భుత్వ నిర్ణ‌యాలు ఉంటాయ‌ని స్ప‌ష్టం చేశారు. భార‌త్‌తో ఏదైనా స‌మ‌స్య ఉంటే త‌మ ఉత్ప‌త్తుల‌ను కొనుగోలు చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని వ్యాఖ్యానించారు.

Minister Jaishankar | బ‌ల‌వంతం చేయ‌డం లేదు..

ట్రంప్ టారిఫ్‌ల (Trump Tariffs) అంశంపై స్పందిస్తూ జైశంక‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వ్యాపారుల కోసం ప‌ని చేసే అమెరికా పాల‌కులు.. ఇత‌రులు వ్యాపారులు చేస్తున్నార‌ని నిందించ‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌ని ఎద్దేవా చేశారు. “వ్యాపార అనుకూల అమెరికన్ పరిపాలన కోసం పనిచేసే వ్యక్తులు ఇతరులు వ్యాపారం చేస్తున్నారని నిందించడం హాస్యాస్పదంగా ఉంది” అని ఆయన అన్నారు. మీకు (అమెరికా, యూర‌ప్ దేశాలు) భారతదేశం నుంచి చమురు లేదా శుద్ధి చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేయడంలో సమస్య ఉంటే కొనకండి. మిమ్మల్ని కొనమని ఎవరూ బలవంతం చేయరని తేల్చి చెప్పారు.

Minister Jaishankar | దేశ ప్ర‌యోజ‌నాలే ముఖ్యం

జాతీయ ప్ర‌యోజ‌నాల కోణంలోనే త‌మ ప్ర‌భుత్వం నిర్ణ‌యాలు తీసుకుంటుంద‌ని విదేశాంగ శాఖ మంత్రి స్ప‌ష్టం చేశారు. “రైతుల ప్రయోజనాలతో పాటు చిన్న ఉత్పత్తిదారుల ప్రయోజనాలకు మేము క‌ట్టుబ‌డి ఉంటాం. ఒక ప్రభుత్వంగా, మా రైతులు. మా చిరు ఉత్పత్తిదారుల ప్రయోజనాలను కాపాడుకోవడానికి కట్టుబడి ఉన్నాము. ఈ విష‌యంలో మేము చాలా దృఢంగా ఉన్నాము. అందులో ఎలాంటి రాజీ ప‌డ‌బోమ‌ని ” ఆయన తెలిపారు. అమెరికాతో చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయ‌న్న జైశంక‌ర్‌.. అదే స‌మ‌యంలో అమెరికా ద్వంద వైఖ‌రిని విమ‌ర్శించారు. భార‌త్ ఒక్క‌టే రష్యా నుంచి చమురు (Russia Oil) కొనుగోలు చేయ‌డం లేద‌ని, చైనా, యూరోపియ‌న్ యూనియ‌న్‌, ఇతర దేశాలు కూడా కొంటున్నాయ‌ని తెలిపారు. కేవ‌లం భార‌త్‌పైనే టారిఫ్‌లు విధించిన అమెరికా.. మ‌రి ఆయా దేశాల‌పై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేద‌ని ప్ర‌శ్నించారు.

Minister Jaishankar | అమెరికాది ప‌క్షపాత వైఖ‌రి

అభివృద్ధి చెందుతున్న దేశాల ప‌ట్ల అమెరికా ప‌క్ష‌పాత వైఖ‌రితో వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని జైశంక‌ర్ విమ‌ర్శించారు. రష్యా నుంచి అత్య‌ధికంగా చ‌మురు కొనుగోలు చేస్తున్న చైనాపై ఎలాంటి సుంకాలు లేవ‌ని ఎత్తి చూపారు. యూఎస్ కొన్ని ఎంపిక చేసిన దేశాల ప‌ట్ల పక్షపాత విధానాన్ని అమలు చేస్తోందని మండిప‌డ్డారు. “వేరే దేశాలు కూడా రష్యా నుంచి చ‌మురు కొంటున్నాయి. కానీ ఆయా దేశాల‌పై లేని సుంకాలు భార‌త్‌పైనే ఎందుకుని” ఆయన నిల‌దీశారు. ప్రపంచ మార్కెట్ విధానాల‌కు అనుగుణంగా భారతదేశ సేకరణ పునరుద్ఘాటించారు.

రష్యా నుండి కొనుగోలు చేయడం ద్వారా ప్రపంచ ఇంధన మార్కెట్లను స్థిరీకరించడంలో సహాయపడటానికి అమెరికా స్వయంగా గతంలో ఇండియాను ప్రోత్సహించిందని ఆయన గుర్తు చేశారు.
అమెరికా. పాకిస్తాన్ (Pakistan) మధ్య సంబంధాలపై జైశంక‌ర్ స్పందిస్తూ.. ఒకరితో మ‌రొక‌రికి గ‌త చరిత్ర ఉందని, చరిత్రను విస్మరించిన అనుభ‌వం కూడా వారికి ఉందన్నారు. అబోటాబాద్​లోకి (పాకిస్తాన్‌లోని) వెళ్లి అక్కడ ఎవరిని కనుగొన్నదో అమెరికా సైన్యానికి తెలియ‌దా? అని గుర్తు చేశారు.