అక్షర టుడే, ఎల్లారెడ్డి: Lingampet mandal | లింగంపేట్ మండలం (Lingampet mandal) రామాయిపల్లికి చెందిన డేగావత్ జైల్‌సింగ్ తెలంగాణ జాగృతి ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) నియమించినట్లు పేర్కొన్నారు.
పట్టణంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా తనను నియమించడంపై కవితకు కృతజ్ఞతలు తెలిపారు. సహకరించిన జాగృతి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు సంపత్ గౌడ్ ధన్యవాదాలు చెప్పారు. జాగృతి సంస్థ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తానన్నారు.
