అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | నిర్లక్ష్యంగా.. అజాగ్రత్తగా వాహనం నడిపి ఒకరి మరణానికి కారణమైన వ్యక్తికి న్యాయస్థానం జైలుశిక్ష విధించింది.
వివరాల్లోకి వెళ్తే.. 2018 డిసెంబర్ 3న సింగరాయిపల్లి గ్రామానికి (Singaraipally village) చెందిన సామగంజి ఎల్లయ్య కామారెడ్డి పట్టణంలోని (Kamareddy town) ధర్మశాల వద్ద టిఫిన్ చేసి ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో రెడ్డిపేట తండాకు చెందిన గంగావత్ లింగం బైక్‌పై అజాగ్రత్తగా వచ్చి ఎల్లయ్యను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఎల్లయ్య తలకు బలమైన గాయం కాగా జీజీహెచ్‌కు తరలించారు.
అక్కడినుంచి మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు (Hyderabad) తరలించగా చికిత్స పొందుతూ అదేనెల 31న మృతి చెందాడు. ఈ విషయమై మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి కారణమైన లింగంను అరెస్ట్ చేశారు. బుధవారం కోర్టులో పోలీసులు సాక్షాధారాలు సమర్పించగా పరిశీలించిన న్యాయమూర్తి నిందితునికి 9 నెలల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.