6
అక్షరటుడే, బోధన్: Bodhan | పోలీసు నిబంధనలకు విరుద్ధంగా, నిర్ణీత సమయానికి మించి దుకాణాలు తెరిచి ఉంచిన ముగ్గురికి జైలు శిక్ష విధించినట్లు పట్టణ సీఐ వెంకట్ నారాయణ (CI Venkat Narayana)తెలిపారు. పట్టణానికి చెందిన బంగారం దుకాణం నిర్వాహకుడు పవన్ చారి, శక్కర్ నగర్‌కు (Shakkar Nagar) చెందిన పాల వ్యాపారి షేక్ యాకూబ్, సాత్పూల్ వద్ద షేక్ హుస్సేన్ తమ దుకాణాలను రాత్రి సమయానికి మించి తెరిచి ఉంచారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేయగా, సోమవారం విచారించిన కోర్టు ఇద్దరికి ఒక రోజు, మరొకరికి రెండు రోజుల చొప్పున జైలు శిక్ష విధించినట్లు సీఐ పేర్కొన్నారు.