అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jagtial Congress Internal Rift | జగిత్యాల కాంగ్రెస్‌లో (Jagtial Congress) రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఒకే పార్టీలో రెండు క్యాంపులు ఉండటంతో మున్సిపల్ పీఠం ఎవరికి దక్కుతుందోననే ఉత్కంఠ నెలకొంది.
Jagtial Congress Internal Rift | హైదరాబాద్ క్యాంప్‌లో..
కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి(Jeevan Reddy) 18 మంది కౌన్సిలర్లతో కలిసి హైదరాబాద్ క్యాంప్‌నకు (Hyderabad Camp Politics) వెళ్లారు. ఎమ్మెల్యే సంజయ్(MLA Sanjay) 23 మందిని క్యాంప్‌నకు తరలించారు. ఎమ్మెల్యే సంజయ్‌తో చేయి కలిపేది లేదని జీవన్‌రెడ్డి అంటున్నారు. దీంతో మున్సిపల్ పీఠం ఎవరికి దక్కుతుందోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇద్దరి మధ్య సయోధ్య( Congress Internal Conflict) కుదిరించి ఛైర్పర్సన్ పదవిని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తోంది. ఈ మేరకు ఇరువురు నేతలతో చర్చలు జరుపుతోంది. మున్సిపల్ ఛైర్పర్సన్ పదవి ఎవరికి దక్కుతుందో అనేది సోమవారం తేలనుంది.
టికెట్ల కేటాయింపులో వివాదం
జగిత్యాల కాంగ్రెస్ (Jagtial Congress)లో వర్గపోరు నెలకొన్న విషయం తెలిసిందే. సీనియర్ నేత జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్‌కు మధ్య పొసగడం లేదు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన సంజయ్ కాంగ్రెస్‌లో చేరడాన్ని జీవన్‌రెడ్డి (Jeevan Reddy) ఆది నుంచి వ్యతిరేకిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం జీవన్‌రెడ్డి వర్గానికి మొండి చెయ్యి చూపింది. ఎమ్మెల్యే సంజయ్ (MLA Sanjay) వర్గానికి 30 సీట్లు ఇచ్చి, జీవన్‌రెడ్డి అనుచరులకు 20 సీట్లు మాత్రమే ఇచ్చారు. దీంతో జీవన్‌రెడ్డి అనుచరులు స్వతంత్రంగా పోటీ చేశారు. మున్సిపాలిటీలో మొత్తం 14 మంది ఇండిపెండెట్లు విజయం సాధించారు. కాంగ్రెస్ 23, బీజేపీ 6, బీఆర్ఎస్ 4, ఎంఐఎం 2 చోట్ల గెలిచాయి. మొత్తం జీవన్‌రెడ్డి వర్గానికి చెందిన వారు 17 స్థానాల్లో, సంజయ్ వర్గం వారు 18 వార్డుల్లో గెలిచారు. రెండు వర్గాలు పట్టువిడవకుండా వేర్వేరుగా క్యాంపులకు వెళ్లడం గమనార్హం.