ePaper
More
    HomeతెలంగాణTelangana Jagruthi | కేసీఆర్​కు నోటీసులు.. జాగృతి ఆధ్వర్యంలో ధర్నా

    Telangana Jagruthi | కేసీఆర్​కు నోటీసులు.. జాగృతి ఆధ్వర్యంలో ధర్నా

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Jagruthi | కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission)​ ఇటీవల మాజీ ముఖ్యమంత్రి, బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్(KCR)​కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. జూన్​ 5న విచారణకు హాజరు కావాలని కమిషన్ నోటీసుల్లో పేర్కొంది. అయితే తాను జూన్ 11న విచారణకు వస్తానని కేసీఆర్​ కమిషన్​కు తెలిపారు.

    కాగా కేసీఆర్​కు నోటీసులు ఇవ్వడంపై ఇప్పటి వరకు బీఆర్​ఎస్ ​(BRS) ఆధ్వర్యంలో ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టలేదు. పలువురు నాయకులు నోటీసులు ఇవ్వడాన్ని ఖండించారు. కానీ పార్టీ పరంగా నిరసనలకు పిలుపునివ్వలేదు. ఈ క్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) మహా ధర్నాకు పిలుపునిచ్చారు.

    ఎమ్మెల్సీ కవిత వ్యవహారం ఇటీవల బీఆర్​ఎస్​ పార్టీలో హాట్​ టాపిక్​గా మారిన విషయం తెలిసిందే. ఆమె కేటీఆర్​ను ఉద్దేశిస్తూ పలుమార్లు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. పార్టీని నడపడం చేతకాదని, బీజేపీలో విలీనం చేయడానికి చూస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో బీఆర్​ఎస్​తో పూర్తిగా దూరంగా ఉంటున్న ఆమె జాగృతి(Jagruthi)పై ఫోకస్​ పెట్టారు. ఇటీవల బంజరాహిల్స్​లో జాగృతి కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్​కు బీఆర్​ఎస్​ ఒక కన్ను అయితే, జాగృతి మరొ కన్ను లాంటిందన్నారు.

    Telangana Jagruthi | ఇందిరా పార్క్​ వద్ద మహాధర్నా

    ఇటీవల కవిత మాట్లాడుతూ.. తన తండ్రిపై ఈగ కూడా వాలనివ్వనని అన్నారు. ఇందులో భాగంగానే కాళేశ్వరం కమిషన్​ నోటీసులకు నిరసనగా.. బుధవారం హైదరాబాద్​లోని ఇందిరాపార్క్​ వద్ద జాగృతి ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టనున్నారు. తెలంగాణ జాగృతి తలపెట్టిన మహా ధర్నాకు కేసీఆర్‌ అభిమానులు, జాగృతి శ్రేణులు తరలి రానున్నారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...