అక్షరటుడే, ఇందల్వాయి: Kalvakuntla Kavitha | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, (Telangana Jagruthi) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జిల్లాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద శనివారం మధ్యాహ్నం ఆమెకు జాగృతి కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.
Kalvakuntla Kavitha | ‘జనంబాట’ పేరుతో..
రాష్టవ్యాప్తంగా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు కల్వకుంట్ల కవిత ’జనంబాట’ పేరుతో యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ యాత్రను తన మెట్టినిళ్లయిన నిజామాబాద్ (Nizamabad) జిల్లా నుంచే ప్రారంభించనున్నారు.
ఇందల్వాయి టోల్‌ప్లాజా (Indalwai Toll Plaza) నుంచి ఆమె నగరంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి చేరుకుని నివాళులర్పిస్తారు. ఈ సందర్భంగా అంతకుముందు నగర శివారులోని ఈనాడు కార్యాలయం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం జాగృతి కార్యాలయానికి చేరుకుంటారు. కవితకు స్వాగతం పలికిన వారిలో జాగృతిప్రతినిదులు సుదాం రవిచందర్, లక్ష్మీనారాయణ, అలీం, శ్రీనివాస్ గౌడ్, అనిల్ తదితరులు ఉన్నారు.
దేవి తండాలో సేవాలాల్ మహరాజ్ ఆలయంలో పూజలు చేస్తున్నకల్వకుంట్ల కవిత తదితరులు



