Homeజిల్లాలుజగిత్యాలIsrael - Iran War | ఇజ్రాయెల్​లో బాంబుల వర్షం.. భయంతో జగిత్యాల వాసి మృతి

Israel – Iran War | ఇజ్రాయెల్​లో బాంబుల వర్షం.. భయంతో జగిత్యాల వాసి మృతి

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్: Israel – Iran War : ఇజ్రాయెల్ -​ ఇరాన్​ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఒక దేశంపై మరో దేశం క్షిపణులతో దాడులకు పాల్పడుతున్నాయి. కాగా, ఇజ్రాయెల్​పై ఇరాన్​ కురిపించిన బాంబుల వర్షంతో ఆ దేశంలో ఉన్న తెలంగాణ వాసి మరణించారు.

ఇజ్రాయెల్ ఆసుపత్రి(Israeli hospital)లో జగిత్యాల (Jagityala) వాసి రవిగౌడ్ చికిత్స పొందుతున్నారు. ఆయనకు 20 రోజుల క్రితం గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేరారు. కాగా, ఇజ్రాయెల్ పై ఇరాన్ బాంబులు వేయడంతో వాటి శబ్దానికి రవిగౌడ్ భయంతో చనిపోయారు.

ఉపాధి కోసం దేశం కాని దేశం వెళ్లి అసువులు బాసిన ఇంటి పెద్ద కోసం కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధిత కుటుంబీకులు వేడుకుంటున్నారు.