Homeజిల్లాలునిజామాబాద్​Jagannath Rath Yatra | అంగరంగ వైభవంగా జగన్నాథ రథయాత్ర

Jagannath Rath Yatra | అంగరంగ వైభవంగా జగన్నాథ రథయాత్ర

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Jagannath Rath Yatra | హరే కృష్ణ.. హరే రామ.. కృష్ణ కృష్ణ హరే హరే… అనే నామస్మరణతో నగరం మార్మోగింది. నిజామాబాద్ ఇస్కాన్ (Nizamabad ISKCON) ఆధ్వర్యంలో శుక్రవారం జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. నిజామాబాద్ ఇస్కాన్ అధ్యక్షుడు సిద్ధ బలరాం తోపాటు అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా రథయాత్రను ప్రారంభించారు.

Jagannath Rath Yatra | భక్తులతో కిక్కిరిసిన కూడళ్లు..

ఆద్యంతం భక్తుల కోలాహలంతో ప్రధాన కూడళ్లు కిక్కిరిసిపోయాయి. జగన్నాథుని రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఒకటో టౌన్ పోలీస్​ స్టేషన్ ముందు నుంచి ప్రారంభమైన రథయాత్ర గాంధీచౌక్, పెద్ద బజార్, ఆర్ ఆర్ చౌరస్తా, పులాంగ్, వినాయక్ నగర్, హనుమాన్ జంక్షన్ వరకు చేరుకొని.. తిరిగి పులాంగ్ చౌరస్తా, ఎల్లమ్మ గుట్ట చౌరస్తా, బస్టాండ్ మీదుగా గాంధీగంజ్​కు చేరుకుంది. కార్యక్రమంలో నిజామాబాద్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముప్పగంగారెడ్డి, కృపాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రథయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా

రథాన్ని లాగుతున్న భక్తులు

Must Read
Related News