అక్షరటుడే, వెబ్డెస్క్: Jagadish Reddy | ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి (BRS leader Jagadish Reddy) కౌంటర్ ఇచ్చారు. ఆదివారం ఉదయం కవిత చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ‘నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి వారికి ఉన్న జ్ఞానానికి నా జోహార్లు.. ఆమె చేసిన ప్రయత్నానికి నా సానుభూతి తెలియజేస్తున్నాను. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో (KCR) మాట్లాడిన విషయాలే నేను మీడియాతో చెప్పాను. ఆయనతో భేటీలో కవిత అంశం ప్రస్తావించలేదు. కేవలం బనకచర్ల, కాళేశ్వరం, ఎరువుల అంశాలపై మాత్రమే మాట్లాడాను. నల్గొండలో పార్టీ గత విజయాలకు నేనే కారణమైతే.. ఇప్పుడు ఓటమికి కూడా నేనే కారణం. బీఆర్ఎస్కు క్రమశిక్షణ కలిగిన సైనికుడిని’’అని వ్యాఖ్యానించారు.
Jagadish Reddy | వాళ్లు ఉపయోగించిన పదాలనే కవిత వాడారు
ఎమ్మెల్సీ కవిత ఉపయోగించిన పదాలను రేవంత్ రెడ్డి, రాధాకృష్ణ (Revanth Reddy and Radhakrishna) ఉపయోగించారని జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. వారి వ్యాఖ్యలనే కవిత వల్లె వేస్తున్నారని అన్నారు. ‘నేను చావు తప్పి కన్నులొట్టబోయినట్లు గెలిచినా.. కానీ కొంతమంది అసలే గెలవలేదు కదా..’ అని అన్నారు.