అక్షరటుడే, వెబ్డెస్క్: jagadeka veerudu athiloka sundari | టాలీవుడ్ ఎవర్ గ్రీన్ హిట్ మూవీ (tollywood evergreen movie) జగదేక వీరుడు అతిలోక సుందరి ఒకప్పుడు ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసింతో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీ 1990లో విడుదల కాగా, అప్పట్లోనే ఈ సినిమా అప్పట్లో థియేటర్లలో సంచలనం సృష్టించింది. డైరెక్టర్ రాఘవేంద్రరావు (director raghvendra rao) దర్శకత్వం వహించిన ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి (megastar chiranjeevi), దివంగత నటి శ్రీదేవి (actress sridevi) జంటగా నటించారు. సోషియో ఫాంటసీ డ్రామాగా వచ్చిన ఈ సినిమాను వైజయంతి మూవీస్ పతాకంపై (vyjayanthi movies banner) నిర్మాత అశ్వనీదత్ భారీ బడ్జెట్తో నిర్మించారు. ఈ మూవీ రిలీజ్ సమయంలో తుపాను బీభత్సం సృష్టించినా కూడా ప్రేక్షకుల రాకను ఎవరు ఆపలేకపోయారు.
jagadeka veerudu athiloka sundari | కలెక్షన్ల వర్షం..
దాదాపు రూ.2 కోట్లతో నిర్మించిన ఈ సినిమా రూ.15 కోట్లకు పైగా కలెక్షన్స్ (collections) రాబట్టి బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసింది. ఇక ఈ చిత్రానికి ఇళయారాజా (ilayaraja) అందించిన మ్యూజిక్ మరో హైలైట్ అని చెప్పాలి. ఇప్పటికీ జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా సాంగ్స్ (jagadeka veerudu athiloka sundari movie songs) యూట్యూబ్ దూసుకుపోతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్గా (megastar chirajeevi career biggest industry industry hit) నిలిచిపోయిన ఈ చిత్రం రిలీజ్ అయ్యి 35 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో మళ్లీ రీ రిలీజ్ (re-release) చేశారు. ఈ సినిమాను వెండితెరపై చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిని చూపుతున్నారు. తొలి రోజు మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ క్రమంలో బాక్సాఫీస్ (box-office) దగ్గర కళ్లు చెదిరే విధంగా రూ.1.75 ఓపెనింగ్స్ వచ్చినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మూవీ మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రాన్ని 4K, 3D ఫార్మాట్లలో రీరిలీజ్ చేశారు మేకర్స్. అప్పట్లో ఈ సినిమా కోసం చిరంజీవి, శ్రీదేవి (chiranjeevi and sridevi) ఎంత రెమ్యునరేషన్స్ తీసుకున్నారనేది కూడా రీరిలీజ్ సందర్భంగా ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాకు అప్పట్లో చిరంజీవి రూ.25 లక్షలు.. శ్రీదేవి రూ.20 లక్షలు పారితోషికంగా తీసుకున్నారట. మూవీ రిలీజ్ సమయానికి ఇద్దరు ఇండస్ట్రీలో టాప్ స్టార్స్ (industry top stars) కావడంతో భారీ మొత్తమే ఇచ్చినట్టు సమాచారం. చిత్రంలో చిరు, శ్రీదేవి కెమిస్ట్రీకి అంతా ఫిదా అయ్యారు. ఈ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేస్తే బాగుండని చాలా మంది ఆశాభావం వ్యక్తం
చేస్తున్నారు.