HomeUncategorizedMovie Ticket Price | వామ్మో.. రూ.6.50 టికెట్ ను రూ.210కి అమ్మారట!..చిరు సినిమానా, మ‌జాకానా?

Movie Ticket Price | వామ్మో.. రూ.6.50 టికెట్ ను రూ.210కి అమ్మారట!..చిరు సినిమానా, మ‌జాకానా?

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Movie Ticket Price | ఇప్పుడు అంటే బ్లాక్ దందా(Black Market) ఎక్కువ అయింది కాని అప్ప‌ట్లో అంత‌గా ఉండేది కాదు. ఏదో మంచి సినిమా అయితే త‌ప్ప జ‌నాలు టిక్కెట్స్(Tickets) కోసం ఎగ‌బ‌డ‌రు.మెగాస్టార్ చిరంజీవి సినిమాల కోసం అయితే థియేట‌ర్స్ దగ్గ‌ర తెగ బారులు తీరేవారు ఆయ‌న అభిమానులు. అయితే చిరంజీవి (Chiranjeevi) కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఎవర్ గ్రీన్ క్లాసిక్ హిట్ ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ (Jagadeka Veerudu Athiloka Sundari) కాగా, ఈ చిత్రం విడుదలై ఈ నెల 9 నాటికి 35 ఏళ్లు పూర్తి కానుంది. ఈ సంద‌ర్భంగా ఆ ఫాంట‌సీ చిత్రాన్ని మ‌ళ్లీ రీరిలీజ్ చేసి ఆడియ‌న్స్‌కి మంచి ఎక్స్‌పీరియ‌న్స్ అందించాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు.

Movie Ticket Price | అప్ప‌ట్లో రికార్డే మ‌రి..

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (Raghavendra Rao) దర్శకత్వం వహించిన ఈ ఐకానిక్ సోషియో – ఫాంటసీ మూవీ బుకింగ్స్ ఇప్ప‌టికే ప్రారంభం అయ్యాయి. ఈ మూవీ రిలీజ్ అప్పుడు దాని క్రేజ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. రూ. 6.50 ధర ఉన్న టిక్కెట్ మొదటి మ్యాట్నీ షోకే బ్లాక్ మార్కెట్‌(Black Market)లో రూ. 210 వరకు అమ్ముడయ్యాయి. అంటే దగ్గర దగ్గరగా 35 రెట్లు అన్నమాట. మ‌రి ఆ సినిమాకి ఎంత క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు. ఇప్పుడు ఈఎవర్ గ్రీన్ క్లాసిక్ మాయాజాలాన్ని మే 9 నుంచి 2D, 3D ఫార్మాట్లలో విడుద‌ల చేయ‌నుండ‌గా, జ‌నాలు ఏ రేంజ్‌లో ఆద‌రిస్తారో చూడాలి.

జగదేక వీరుడు అతిలోక సుందరిలో మెగాస్టార్ చిరంజీవి Chiranjeevi టూరిస్ట్ గైడ్‌గా, లెజెండరీ శ్రీదేవి ఇంద్రజ పాత్రను పోషించారు. ఈ చిత్రంలో అమ్రిష్ పూరి, అల్లు రామలింగయ్య, కన్నడ ప్రభాకర్, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, రామి రెడ్డి, బేబీ షాలిని, బేబీ షామిలీ వంటి వారు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. ఆ కాలంలో అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగా నిర్మాత సి.అశ్వినీదత్ తన ప్రతిష్టాత్మక వైజయంతి మూవీస్ బ్యానర్‌పై నిర్మించిన సంగతి తెలిసిందే. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలోని పాటలు నేటికీ తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి. ఈ మూవీకి కథను యండమూరి వీరేంద్రనాథ్.. స్క్రీన్‌ప్లేను జంధ్యాల అందించారు.