ind vs eng
ind vs eng | పోరాడుతున్న జడేజా, సుందర్​.. టీ బ్రేక్​ స‌మ‌యానికి భార‌త్ స్కోరు ఎంతంటే..!

అక్షరటుడే, వెబ్​డెస్క్​: ind vs eng | మాంచెస్ట‌ర్ టెస్ట్ (Manchester Test) ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును కేఎల్ రాహుల్‌(90), గిల్‌ (Subhman Gil) (103) ఆదుకునే ప్ర‌య‌త్నం చేశారు. నాలుగో రోజు వీరిద్ద‌రూ చాలా ఓపిక‌తో ఇన్నింగ్స్ ఆడారు. అయితే ఐదో రోజు రాహుల్ 90 ప‌రుగుల‌కు చేరుకున్న త‌ర్వాత స్టోక్స్ బౌలింగ్స్ ఎల్బీగా ఔటై పెవీలియ‌న్ చేరాడు. ఇక కొత్త బంతిని అందుకున్న ఆర్చ‌ర్ అద్భుత‌మైన బంతితో గిల్‌ని బోల్తా కొట్టించాడు. దీంతో ఐదో రోజు ఫ‌స్ట్ సెష‌న్‌లో రెండు కీల‌క వికెట్లు కోల్పోయింది భార‌త్. అనంతరం క్రీజులోకి వచ్చిన జడేజా(Jadeja), వాషింగ్టన్​ సుందర్ (Washington Sundar)​ పోరాడుతున్నారు. రెండో సెషన్​ మొత్తం వికెట్​ పడకుండా వీరు బ్యాటింగ్​ చేశారు. టీ బ్రేక్ సమయానికి వాషింగ్ట‌న్ సుంద‌ర్( 58 నాటౌట్‌), జ‌డేజా (53 నాటౌట్‌) క్రీజులో ఉన్నారు. రెండో సెషన్​ ముగిసే సమయానికి భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 322 పరుగులు చేసింది. ఇంకో సెషన్​ బ్యాటింగ్​ చేస్తే మ్యాచ్​ డ్రా అవుతుంది.

ind vs eng | ఏం చేస్తారో..

ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు ఇంగ్లండ్ (England) శాయ‌శ‌క్తులా కృషి చేస్తుంది. మ‌రోవైపు ఈ మ్యాచ్‌ను డ్రా చేసేందుకు భార‌త్ (Bharat) క‌ష్ట‌ప‌డుతుంది. ఈ క్రమంలో సెంచరీ భాగ్యస్వామ్యంతో జడేజా, సుందర్​ భారత్​ ఓటమికి అడ్డుకుట్ట వేశారు. ఈ రోజు ఇంకో 35 ఓవర్లు మ్యాచ్​ మిగిలి ఉంది. అప్పటి వరకు భారత్ వికెట్లు పడకుండా ఆడితే మ్యాచ్​ డ్రా అవుతుంది.

ind vs eng | సెంచరీతో చెలరేగిన గిల్​

యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన తొలి సిరీస్‌కే అసాధారణ ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మాంచెస్టర్ టెస్టులో గిల్ శతకం సాధించి చరిత్ర సృష్టించాడు. నాలుగో రోజు ఆరంభమైన ఇన్నింగ్స్‌ను ఐదో రోజు తొలిసెషన్‌లో సెంచరీగా మార్చిన గిల్, ఈ సిరీస్‌లో తన నాలుగో శతకం కొట్టి మరోసారి తన తరహా క్లాస్‌ను నిరూపించాడు.

ఒకే సిరీస్‌లో నాలుగు సెంచరీలు బాదిన గిల్, ఈ ఘనత సాధించిన అరుదైన భారత ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఇప్పటివరకు ఈ ఘనతను సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లీ మాత్రమే సాధించగా.. ఇప్పుడు గిల్ కూడా వారి జాబితాలో చేరాడు. అంతేకాదు, బ్రాడ్‌మన్, గవాస్కర్ వంటి దిగ్గజాలు కెప్టెన్సీలో చేసిన ఈ వినూత్న రికార్డును గిల్ సమం చేశాడు. గిల్ ఈ టెస్టు సిరీస్‌లో ఇప్పటి వరకు 700 పరుగుల మార్క్‌ను దాటేశాడు. ఇది ఒక టెస్టు సిరీస్‌లో భారత కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన ఘనత. ఈ రికార్డును అందుకున్న తొలి భారత సారథిగా గిల్ నిలిచాడు. ఆటగాడిగా చూస్తే, అతడు ఈ ఘనత సాధించిన నాలుగో భారతీయుడు. ఈ మైలురాయిని గవాస్కర్ Gavaskar తరువాత బ్రాడ్‌మన్, గ్యారీఫీల్డ్ సోబర్స్, గ్రెగ్ ఛాపెల్, గ్రేమ్ స్మిత్ వంటి దిగ్గజాలు మాత్రమే చేరుకున్నారు. కేఎల్ రాహుల్ ఔటైన తరువాత సమయోచితంగా బ్యాటింగ్ చేసిన గిల్, జట్టు స్కోరును 200 దాటించడంలో కీలక పాత్ర పోషించాడు.