ePaper
More
    HomeతెలంగాణBC Reservations | బీసీ రిజర్వేషన్ల కోసం జేఏసీలు ఏర్పాటు చేసి పోరాడాలి : మంత్రి...

    BC Reservations | బీసీ రిజర్వేషన్ల కోసం జేఏసీలు ఏర్పాటు చేసి పోరాడాలి : మంత్రి పొన్నం ప్రభాకర్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BC Reservations | రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల సాధన కోసం పోరుబాట పట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్​ (Minister Ponnam Prabhakar) సూచించారు. తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన విధంగా రిజర్వేషన్ల సాధన కోసం బీసీలు అంతా ఏకతాటిపైకి రావాలని ఆయన సూచించారు. గ్రామ గ్రామాన జాయింట్​ యాక్షన్​ కమిటీలు (JAC) ఏర్పాటు చేసుకొని పోరాడాలన్నారు.

    విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని గతంలో కాంగ్రెస్ (Congress)​ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన అనంతరం కులగణన (Caste Census) చేపట్టి బీసీ రిజర్వేషన్​ బిల్లులను అసెంబ్లీలో ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం బిల్లులను ఢిల్లీకి పంపించింది. అయితే కేంద్రం బిల్లులు ఆమోదించకపోవడంతో కాంగ్రెస్​ ఇటీవల ఢిల్లీలో (Delhi) ధర్నా చేసిన విషయం తెలిసిందే. తాజాగా మంత్రి పొన్నం రిజర్వేషన్ల అంశంపై మాట్లాడారు.

    BC Reservations | బీసీ విభాగాలను ఏర్పాటు చేసుకోవాలి

    ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులు బీసీ విభాగాలను ఏర్పాటు చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్​ సూచించారు. బీసీ ఉద్యోగులు, విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లే విధంగా కమిటీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు ముందుండి బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాలని సూచించారు.

    BC Reservations | రిజర్వేషన్లను అడ్డుకుంటున్న బీజేపీ

    కేంద్రంలోని బీజేపీ (BJP) ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటుందని మంత్రి పొన్నం విమర్శించారు. శాసనసభలో బిల్లుకు ఆమోదం తెలిపిన బీజేపీ ఇప్పుడు మతపరమైన కారణాలు చెప్పి బిల్లును అడ్డుకోవడం సరికాదన్నారు. ముస్లింల పేరు మీద బీజేపీ ఈ చట్టాన్ని అడ్డుకోవాలని చూస్తోందని విమర్శించారు.

    బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామనడంతో బీజేపీకి భయం పట్టుకుందని విమర్శించారు. అందుకే తాము రాష్ట్రపతి అపాయింట్​మెంట్​ కోరి 10 రోజులైనా కలవనివ్వడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు ఢిల్లీ వెళ్లి ఎదురు చూసినా రాష్ట్రపతి ఎందుకు అపాయింట్​మెంట్​ ఇవ్వలేరన్నారు. ముస్లింల పేరుతో రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నాన్ని కిషన్ రెడ్డి (Kishan Reddy) మానుకోవాలన్నారు. బిల్లులో ఎక్కడా కూడా మతపరమైన ప్రస్తావన లేదన్నారు.

    Latest articles

    Rajat Patidar | ర‌జ‌త్ చేసిన త‌ప్పిదం.. కిరాణ కొట్టు వ్య‌క్తికి విరాట్‌, డివిలియ‌ర్స్ నుండి ఫోన్ కాల్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Rajat Patidar | ఆర్‌సీబీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) కెప్టెన్ రజత్ పటీదార్ (RCB Captain...

    Weather Updates | నేడు రాష్ట్రానికి భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రవ్యాప్తంగా సోమవారం భారీ వర్షం (Heavy Rain) కురిసే అవకాశం...

    Tamil Nadu | హాస్ట‌ల్‌లో త‌న ల‌వ‌ర్‌కి పుట్టిన బిడ్డ‌.. సంచిలో తీసుకెళ్లి ఆసుప‌త్రిలో అప్ప‌గించిన ప్రియుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Tamil Nadu | తమిళనాడు రాజధాని చెన్నైలో (Chennai) ఓ యువకుడి ప్రవర్తన మొద‌ట మానవత్వానికి...

    NTR Says sorry to Revanth | రేవంత్ రెడ్డి పేరు మ‌రిచిపోయిన జూనియ‌ర్ ఎన్టీఆర్.. క్ష‌మాప‌ణ‌లు చెబుతూ వీడియో రిలీజ్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన తాజా చిత్రం వార్ 2 (War 2) రిలీజ్‌కి రెడీ...

    More like this