అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jacqueline Fernandez | గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇటీవల తన జీవనశైలిలో ఒక కీలక మార్పు చేసింది. గతంలో మాంసాహారం ఇష్టపడే ఈ బ్యూటీ ఇప్పుడు పూర్తిగా శాకాహారిగా మారిపోయి, కేవలం మొక్కల ఆధారిత ఆహారాన్ని మాత్రమే తీసుకుంటున్నట్లు ప్రకటించింది.
ఈ మార్పు వల్ల ఆమె శరీరంలో కొన్ని ఆశ్చర్యకరమైన మార్పులు చోటు చేసుకున్నాయని ఇటీవల చేసిన ఇంటర్వ్యూలో జాక్వెలిన్ వివరించింది.ఆ వింత మార్పులలో ప్రధానంగా ఆమె ఆరోగ్య సమస్యలు (Health Problems) పూర్తిగా మాయమయ్యాయని చెప్పింది. ముఖ్యంగా ‘అడల్ట్ ఆక్నే’ (Adult Acne) సమస్య, అంటే పెద్దవారిలో వచ్చే మొటిమలు, పూర్తిగా తగ్గాయని ఆమె వెల్లడించింది.
Jacqueline Fernandez | ఆ మార్పులతో సాధ్యం..
ఎప్పుడూ చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతున్న జాక్వెలిన్‌కు శాకాహారం ఒక వరంగా మారిందని పేర్కొంది. అదేవిధంగా, బరువు పెరగడం, తగ్గడం వంటి సమస్యలు కూడా ఆగిపోయి, బరువు స్థిరంగా ఉన్నదని చెప్పింది.ప్రోటీన్ తీసుకోవడం విషయంలోను శాకాహార వాదనలను సవాల్ చేస్తూ, జాక్వెలిన్ బీన్స్, టోఫు, వివిధ రకాల కూరగాయల (Vegetables) ద్వారా తగినంత ప్రోటీన్ పొందుతుందని తెలిపింది. అదనపు ప్రోటీన్ అవసరమైతే వీగన్ ప్రోటీన్ షేక్స్ తీసుకుంటానని స్పష్టం చేసింది. జిమ్‌లో కఠినమైన వర్కౌట్లు చేస్తూ తన శరీరాన్ని ఫిట్‌గా ఉంచే ఈ గ్లామర్ క్వీన్, ప్లాంట్ బేస్డ్ డైట్ వల్ల అవసరమైన శక్తి లభిస్తోందని పేర్కొంది.
తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియా (Social Media)లో వైరల్‌గా మారుతున్నాయి. కేవలం ఆహారపు అలవాట్ల మార్పుతో చర్మ సౌందర్యం, ఆరోగ్యం మెరుగుపడతుందన్న నిజాన్ని జాక్వెలిన్ నిరూపించింది. వెజిటేరియన్ లైఫ్ స్టైల్ వైపు అడుగులు వేయాలనుకునే వారికి ఆమె ఒక స్ఫూర్తిగా నిలుస్తోంది. తన అనుభవాలను పంచుకుంటూ, శాకాహార జీవనం వల్ల జీవితంలో సాధించగలిగే శక్తి, హాయిని వివరించింది.