అక్షరటుడే, వెబ్‌డెస్క్: jabardasth sekhar | బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ (Jabardasth comedy show) ఎంతో మందిని సెలబ్రిటీలను చేసింది. సుడిగాలి సుధీర్ (sudigali sudheer), బలగం వేణు, గెటప్ శీను, ఆటో రామ్ ప్రసాద్, ధనాధన్ ధన్ రాజ్, చలాకీ చంటి, ముక్కు అవినాష్, అదిరే అభి, చమ్మక్ చంద్ర, రాకెట్ రాఘవ, శాంతి కుమార్ వంటి వారు ఇప్పుడు ఓ వెలుగు వెలుగుతున్నారు. కొందరు హీరోలుగా, మరి కొందరు దర్శకులుగా, ఇంకొందరు నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్నారు. ఇంకొందరు జబర్దస్త్ షోలో లేడీ గెటప్స్ (lady getup) వేస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో జబర్దస్త్ నటుడు టీవీ షోలో సుమారు ఏడేళ్లు ఉన్నాడు. సుమారు 300కు పైగా ఎపిసోడ్స్ చేశాడు.
jabardasth sekhar | ఎందుకు ఇలా..
లేడీ గెటప్పులతో బుల్లితెర ఆడియెన్స్‌ను కడుపుబ్బా నవ్వించాడు జబర్దస్త్ శేఖర్.. కట్ చేస్తే.. ఈ నటుడు ఇప్పుడు కూరగాయలు (vegetables), ఆకు కూరలు అమ్ముకుంటున్నాడు. వీటి ద్వారా వచ్చిన డబ్బులతోనే జీవనం సాగిస్తున్నాడు. జబర్దస్త్‌లో ఖమ్మం సుజాతగా లేడీ గెటప్పులతో (khammam sujatha lady getup) ఆకట్టుకున్న శేఖర్ తెలంగాణలోని ఖమ్మం ప్రాంతంలో నివసిస్తున్నాడు. చాలామంది లాగే ఎన్నో ఆశలతో జబర్దస్త్ లోకి అడుగు పెట్టిన అతను హైపర్ ఆది (hyper aadi) సహాయంతో ఈ షోలోకి అడుగు పెట్టి వెంకీ మంకీ టీంలో చాలా ఏళ్ల పాటు ఉన్నాడు. ఖమ్మం సుజాతగా విభిన్నమైన లేడీ గెటప్పులు వేస్తూ బుల్లితెర ఆడియన్స్‌కి (silver screen audience) మంచి వినోదాన్ని పంచాడు.
అయితే అతనికి అవకాశాలు తగ్గిపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. దాంతో కూరగాయలు, ఆకు కూరలు అమ్ముకుంటూ (selling) జీవనం సాగిస్తున్నాడు. తొమ్మిదో తరగతి వరకు చదివిన అతను మిర్చి మార్కెట్లో హమాలీ పనులు చేశాడు. అతను మంచి డ్యాన్సర్ కాగా, ‘అదృష్టం కొద్దీ జబర్దస్త్‌లో అవకాశమొచ్చింది. అయితే తన భార్యకు థైరాయిడ్, బ్లడ్ ఇన్ఫెక్షన్ సమస్యలు ఉన్నాయి. తరచూ ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తుంది. అలాగే పిల్లల స్కూల్ ఫీజులు, ఇలా చాలా ఖర్చులు ఉన్నాయి. నా భార్య, పిల్లలకు దగ్గరగా ఉండాలని జబర్దస్త్ (Jabardasth) మానేశాడట.. ప్రస్తుతానికి నా కుటుంబమే నాకు ముఖ్యం. జబర్దస్త్‌లో మళ్లీ ఛాన్స్ వస్తే ఆలోచిస్తా అని’ ఎమోషనల్ అయ్యాడు శేఖర్.