HomeసినిమాJanhvi Swaroop | మ‌హేష్ బాబు ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా.. పీక్స్‌కు చేరిన ఫ్యాన్స్ ఆనందం

Janhvi Swaroop | మ‌హేష్ బాబు ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా.. పీక్స్‌కు చేరిన ఫ్యాన్స్ ఆనందం

సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి తొలిసారిగా ఓ కథానాయిక సినీ రంగంలోకి అడుగుపెట్టబోతోంది. ఆయన మనవరాలు, మంజుల ఘట్టమనేని కుమార్తె జాన్వీ స్వరూప్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Janhvi Swaroop | సూపర్‌స్టార్ ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసురాలు సినీ రంగంలోకి అడుగుపెట్టబోతోంది. మహేష్ బాబు (Mahesh Babu) మేనకోడలు, మంజుల ఘట్టమనేని – స్వరూప్ దంపతుల కుమార్తె జాన్వీ స్వరూప్ (Janhvi Swaroop) హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు.

ఈ విషయాన్ని తాజాగా అధికారికంగా ప్రకటించారు. జాన్వీ చిన్నప్పటి నుంచే కళారంగంపై ఆసక్తి చూపుతూ నటన, నృత్యం, పెయింటింగ్, ఫిట్‌నెస్, డ్రైవింగ్ తదితర రంగాల్లో ప్రత్యేక శిక్షణ పొందారు. నటిగా మారకముందే ఒక జ్యువెలరీ బ్రాండ్ ప్రకటనలో (Jewelry Brand Advertisement) కనిపించి, తన అందం, ఆకర్షణతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత పలువురు జాతీయ స్థాయి దర్శకులు, బ్రాండ్లు ఆమెను సంప్రదించారని సమాచారం.

Janhvi Swaroop | వార‌సుల హంగామా..

ఇక జాన్వీకి సినిమాలపై ఉన్న అభిరుచి కొత్తది కాదు. కేవలం పదేళ్ల వయసులోనే తల్లి మంజుల ఘట్టమనేని దర్శకత్వం వహించిన మనసుకు నచ్చింది సినిమాలో చిన్న పాత్రలో నటించి తన సహజమైన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత కూడా నటన, నృత్యం మీద తన సాధన కొనసాగించింది. జాన్వీ ఎంట్రీపై స్పందించిన మంజుల.. “ఒకప్పుడు నన్ను ‘నీవు హీరోయిన్‌గా ఎందుకు?’ అని అడిగినవారే, ఇప్పుడు ‘నీ కుమార్తె సినిమాల్లోకి రావాలి’ అని ప్రోత్సహిస్తున్నారు. నా కుమార్తె చిరునవ్వే నా ప్రార్థనలకు సమాధానం” అంటూ ఆనందం వ్యక్తం చేశారు.

గతంలో మంజుల ఘట్టమనేని బాలకృష్ణ పక్కన హీరోయిన్‌గా నటించాల్సి ఉన్నప్పటికీ, అప్పట్లో సూపర్‌స్టార్ కృష్ణ అభిమానులు “మా హీరో కూతుర్ని హీరోయిన్‌గా చూడలేం” అంటూ వ్యతిరేకించడంతో ఆమె ఆ అవకాశాన్ని వదులుకున్నారు. ఇప్పుడు ఆమె కుమార్తె హీరోయిన్‌గా సినీ రంగంలోకి రావడం మంజులకే కాక, ఘట్టమనేని కుటుంబానికి కూడా గర్వకారణంగా మారింది. మరోవైపు మహేష్ బాబు  రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా ద్వారా అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటుండగా.. అదే సమయంలో ఆయన మేనకోడలు జాన్వీ స్వరూప్‌ హీరోయిన్‌గా అడుగుపెట్టడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.