ePaper
More
    Homeక్రీడలుAaron Finch | నా జీవితంలోనే ఇంత చెత్త షాట్ చూడలేదు: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్

    Aaron Finch | నా జీవితంలోనే ఇంత చెత్త షాట్ చూడలేదు: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Aaron Finch | లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) కెప్టెన్ రిషభ్ పంత్‌పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆరోన్ ఫించ్(Aaron Finch) ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రిషభ్ పంత్(Rishabh Pant) ఔటైన తీరుపై ఆరోన్ ఫించ్ విమర్శలు గుప్పించాడు. తన జీవితంలోనే ఇలాంటి చెత్త షాట్ చూడలేదని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ 37 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసింది.

    రిషభ్ పంత్ 17 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్ సాయంతో 18 పరుగులే చేసి చెత్త షాట్‌తో వెనుదిరిగాడు. వైఫల్యం లక్నో(Lucknow) విజయవకాశాలను దెబ్బతీసింది. అతను ఔటైన తీరు అందర్నీ ఆశ్యర్యపరిచింది. చేతిలో నుంచి బ్యాట్ జారిపోగా.. బంతి ఫీల్డర్ చేతిలోకి వెళ్లింది. అజ్మతుల్లా ఒమర్జాయ్(Azmatullah Omarzai) వేసిన 7వ ఓవర్‌లో ఈఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఐదో బంతిని ఒమర్జాయ్ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేయగా.. పంత్ స్టెప్ ఔటై భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ చేజారి స్క్వేర్ లెగ్ దిశలో పడగా.. బంతి డీప్ పాయింట్‌లోని శశాంక్(Shashank) చేతిలో పడింది. పంత్ బ్యాట్‌తో పాటు తన వికెట్‌ను చేజార్చుకొని లక్నో కొంపముంచాడు.

    ఈ సమయంలో ఇంగ్లీష్ కామెంట్రీ చెబుతున్న ఆరోన్ ఫించ్(Aaron Finch).. పంత్‌పై విమర్శలు గుప్పించాడు. ‘నా క్రికెట్‌ కెరీర్‌లోనే నేను ఇంత చెత్త షాట్‌ను చూడలేదు.’అని వ్యాఖ్యానించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ..రిషభ్ పంత్(Rishabh Pant) తన కీపింగ్ బాధ్యతలను నికోలస్ పూరన్‌కు అప్పగించాలని సూచించాడు. అప్పుడే అతనికి కెప్టెన్సీ సులువు అవుతుందని చెప్పాడు. ‘రిషబ్ పంత్ వికెట్ కీపింగ్(Wicket Keeping) చేస్తూ కెప్టెన్సీ చేయడం చాలా కష్టం. ఓవర్ల మధ్య సమయం తక్కువగా ఉండటంతో బౌలర్లతో మాట్లాడటం అతనికి కష్టమవుతుంది. నికోలస్ పూరన్ వికెట్ కీపింగ్ చేస్తే, రిషభ్ పంత్ బౌలర్లతో సునాయసంగా మాట్లాడగలడు.’అని ఆరోన్ ఫించ్ చెప్పుకొచ్చాడు.

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 6 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Kartavya Bhavan | కేంద్ర పరిపాలనా మౌలిక సదుపాయాల ఆధునికీకరణ.. నేడు కర్తవ్య భవన్​ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Kartavya Bhavan : సెంట్రల్ విస్టా (Central Vista) కింద మొదటి కామన్ సెక్రటేరియట్ (first...

    Indian Army | కాల్పుల ఉల్లంఘన జరగలేదు : ఇండియన్​ ఆర్మీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Indian Army : పాకిస్తాన్ (Pakistan) కాల్పుల విరమణ ఉల్లంఘనను మంగళవారం భారత సైన్యం ఖండించింది....

    Komatireddy | సినీ కార్మికుల సమ్మె.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, హైదరాబాద్: Komatireddy : టాలీవుడ్​(Tollywood)లో సినీ పరిశ్రమ కార్మికులు (Cinema industry workers) సమ్మె బాట పట్టారు....

    More like this