ePaper
More
    Homeఅంతర్జాతీయంTurkey is friends with Pakistan | సాయం చేసిన భారత్​ను కాదని.. పాక్​తోనే తుర్కియే...

    Turkey is friends with Pakistan | సాయం చేసిన భారత్​ను కాదని.. పాక్​తోనే తుర్కియే దోస్తీ.. కారణం అదేనా..

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Turkey is friends with Pakistan : పహల్గావ్​ ఉగ్రదాడి(Pahalgaon terror attack)కి భారత్​ ఆపరేషన్ సిందూర్‌(Operation Sindoor) చేపట్టింది. కాగా, పాకిస్తాన్​కు అండగా తుర్కియే నిలిచింది. దాయాది దేశానికి సైనిక సాయం చేసింది. తద్వారా పాకిస్తాన్​​ తమ మిత్రదేశమనే సంకేతాలను భారత్‌కు చేరవేసింది. దీనికితోడు పాకిస్తాన్​కే తమ మద్దతు అంటూ తుర్కియే అధ్యక్షుడు రజబ్ తయ్యబ్ ఎర్డోగాన్(Turkish President Recep Tayyip Erdogan) ప్రకటిస్తూ వచ్చారు.

    ఇదిలా ఉంటే తాజాగా తుర్కియేలో పాకిస్తాన్​​ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్(Pakistani Prime Minister Shehbaz Sharif), ఆర్మీ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్(Army Field Marshal Asim Munir) పర్యటిస్తున్నారు. రక్షణ సంబంధిత కీలక ఒప్పందాలు చేసుకోవడానికి పాకిస్తాన్​, తుర్కియే అధినేతలు సిద్ధం అవుతున్నారు.

    Turkey is friends with Pakistan : అందుకే నాకు నువ్వు, నీకు నేను

    ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్​కు తుర్కియే కార్గో విమానాల్లో సైనిక సామగ్రిని పంపింది. ఇందులో డ్రోన్లు, మిస్సైళ్లు, రాడార్ వ్యవస్థలు ఉన్నట్లు ప్రచారంలో ఉంది. ఇదే తరుణంలో పాక్​కు తమ మద్దతు కొనసాగుతుందని తుర్కియే ప్రకటించడం కొసమెరుపు.

    వాస్తవానికి ఎప్పటి నుంచో పాక్‌, తుర్కియే సైన్యాలు, నిఘా విభాగాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగుతున్నాయి. అమెరికా(United States), నాటి సోవియట్ యూనియన్ (రష్యా) former Soviet Union (Russia)) మధ్య కోల్డ్‌వార్ ముగిసినప్పటి నుంచి పాక్​, తుర్కియేలు ఏకాకులుగా ఉండిపోయాయి. ఈ రెండింటికీ మిత్రదేశాలు లేకపోవడంతో.. నీకు నేను.. నాకు నీవు.. అన్నట్లు కలిసిమెలిసి ఉండటం గమనార్హం.

    Turkey is friends with Pakistan : అంటరానిదేశంలా..

    రష్యా నుంచి ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థలను కొన్నాక.. తుర్కియేపై అమెరికా సహా నాటో(NATO) కూటమి సభ్య దేశాలు ఆంక్షలు విధించాయి. ఇదే సమయంలో నాటో కూటమిలో లేని ఇజ్రాయెల్, యూఏఈ లాంటి దేశాలకు అత్యాధునిక ఆయుధ టెక్నాలజీలను బేషరతుగా అందించాయి. అలా నాటో కూటమిలో అంటరానిదేశంలా తుర్కియే ఉండిపోయింది. అందుకే దక్షిణాసియాలోని పాక్​, బంగ్లాదేశ్, చైనా, మాల్దీవ్స్ వంటి వాటికి దగ్గరయ్యేందుకు తుర్కియే ప్రయత్నిస్తోంది.

    Turkey is friends with Pakistan : పాక్ కోసం తుర్కియేని దింపింది చైనానే !

    వాస్తవానికి పాక్​కు తుర్కియే సైనిక మద్దతు అందించడానికి ప్రధాన కారణం చైనా. చైనా వల్లే తుర్కియే అంత సాహసోపేతంగా పాక్‌కు వెన్ను దన్నుగా నిలుస్తోంది. తుర్కియే, చైనా మధ్య బలమైన వాణిజ్య బంధమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్ఐ) ప్రాజెక్టు చైనాకు ఎంత ప్రాధాన్యమో.. మిడిల్ కారిడార్ తుర్కియేకి అంత ప్రాముఖ్యం.

    చైనా బీఆర్ఐ ప్రాజెక్టులో భాగమే మిడిల్ కారిడార్. ఈ మిడిల్ కారిడార్ తుర్కియేని చైనాతో రోడ్డు, జల మార్గాల్లో మరింత మెరుగ్గా కనెక్ట్ చేయనుంది. చైనా నుంచి కజకిస్తాన్, కాస్పియన్ సముద్రం, అజర్ బైజాన్, జార్జియా(Kazakhstan, the Caspian Sea, Azerbaijan, Georgia) మీదుగా తుర్కియే వరకు సరికొత్త వాణిజ్య మార్గాలు ఏర్పడనున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం చైనా భారీగానే నిధులు వెచ్చిస్తోంది. దీని నిర్మాణం పూర్తయితే చైనా, తుర్కియే మధ్య వాణిజ్య బంధం గణనీయంగా పెరగనుంది. నాటో దేశాల నుంచి ఏకాకిగా మారిన తుర్కియేకు చైనా అండగా నిలవడంతో.. డ్రాగన్​ కనుసన్నల్లోనే పాక్​కు తుర్కియే సహకారం అందిస్తోందని తెలుస్తోంది.

    Turkey is friends with Pakistan : దాని మూలాల్లోనే విషబీజాలు

    పాకిస్తాన్​తో దోస్తీ కోసం భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను సైతం దెబ్బతీసుకునేందుకు తుర్కియే సిద్ధమైంది. దీనికి మరో కారణం తుర్కియేలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీగా పేర్కొనవచ్చు. తుర్కియే అధ్యక్షుడు రజబ్ తయ్యబ్ ఎర్డోగాన్ ప్రాతినిథ్యం వహిస్తున్న జస్టిస్ అండ్ డెవలప్‌మెంట్ పార్టీ (జేడీపీ) Justice and Development Party (JDP) తీవ్రమైన ఇస్లామిక్ భావజాలం కలిగి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎర్డోగాన్ పాలనా పరమైన నిర్ణయాలు మతపరమైన కోణంలోనే ఉంటున్నాయి. అందుకే నాటో కూటమి దేశాల్లో తుర్కియే ప్రతిష్ఠ మసకబారిపోయింది.

    తుర్కియే.. 2019 నుంచి ఐక్యరాజ్యసమితి సహా వివిధ అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతోంది. జమ్మూకశ్మీర్(Jammu Kashmir) విషయంలో పాక్‌కు అనుకూలంగా గళం వినిపించింది. జమ్మూకశ్మీర్‌ స్వయం ప్రతిపత్తిని భారత్​ సర్కారు రద్దు చేయడాన్ని తుర్కియే తప్పుపట్టింది. కాగా, దీనిపై భారత విదేశాంగ శాఖ అప్పుడే తుర్కియేని ఎండగట్టింది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...