HomeUncategorizedIndus Waters | అది భార‌త్ వేసిన వాట‌ర్ బాంబ్‌.. సిందూ జ‌లాల ఒప్పందం ర‌ద్దుపై...

Indus Waters | అది భార‌త్ వేసిన వాట‌ర్ బాంబ్‌.. సిందూ జ‌లాల ఒప్పందం ర‌ద్దుపై పాక్ సెనెట‌ర్‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indus Waters | సిందూ జ‌లాల ఒప్పందం ర‌ద్దు చేయ‌డం ద్వారా భార‌త ప్ర‌భుత్వం పాకిస్తాన్‌పై వాట‌ర్ బాంబ్ ప్రయోగించిందని పాక్ సెనేట‌ర్ స‌య్య‌ద్ అలీ జాఫ‌ర్ (Pakistan Senator Syed Ali Zafar) పేర్కొన్నారు. దాన్ని నిర్వీర్యం చేయ‌క‌పోతే ల‌క్ష‌లాది మంది ఆక‌లిద‌ప్పిక‌ల‌తో మ‌ర‌ణిస్తార‌ని ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్ర దాడిని (Pahalgam terrorist attack) నిర‌సిస్తూ భార‌త ప్ర‌భుత్వం పాకిస్తాన్‌పై అనేక చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇందులో ప్ర‌ధాన‌మైన‌ది సిందూ జ‌లాల ఒప్పందం (Indus Waters Treaty) ర‌ద్దు. ఈ నిర్ణ‌యం పాకిస్తాన్‌ను ఎలా నిర్వీర్యం చేస్తుందో తాజాగా ఆ దేశ సెనేట‌ర్ వివ‌రించారు. ప్ర‌తిప‌క్ష పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) (Pakistan Tehreek-e-Insaf) సెనెట‌ర్ జాఫ‌ర్ సెనేట్‌లో మాట్లాడారు. భారతదేశం వేసిన “వాటర్ బాంబు”ను (water bomb) “నిర్వీర్యపరచాలని” హెహ‌బాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కోరారు.

Indus Waters | ఆక‌లిచావులు త‌ప్ప‌వు..

పాకిస్తాన్‌లో (pakistan) ప్ర‌తీ పది మందిలో ఒకరు సిందు నది నీటిపై ఆధారపడి ఉన్నారని జాఫ‌ర్ తెలిపారు. ఇప్పుడు నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించకపోతే పెద్ద మొత్తంలో జనాభా ఆకలితో చనిపోవచ్చని హెచ్చరించారు. “మనం ఇప్పుడు ఈ నీటి సంక్షోభాన్ని పరిష్కరించకపోతే పెద్ద సంఖ్య‌లో ఆకలిచావులు త‌ప్ప‌వు. కారణం సింధు బేసిన్ మన జీవనాధారం. దేశం వెలుపల నుంచే మనకు మూడింత‌ల నీళ్లు వస్తాయి. ప్రతి పది మందిలో తొమ్మిది మంది అంతర్జాతీయ సరిహద్దు బేసిన్‌ల (international border basins) ఆధారంగా తమ జీవితాలను గడుపుతున్నారు” అని జాఫర్ వివ‌రించారు. “మన పంటలలో 90% సిందూ జ‌లాల‌పైనే ఆధారపడి ఉన్నాయి. మన విద్యుత్ ప్రాజెక్టులు, ఆనకట్టలన్నీ (power projects and dams) ఈ నీటిపైనే నిర్మించబడ్డాయి. అందుకే ఇది మనపై వేలాడుతున్న నీటి బాంబు (Water Bomb) లాంటిదని మనం అర్థం చేసుకోవాలి. మనం దానిని నిర్వీర్యం చేయడానికి కృషి చేయాలని” ఆయన కోరారు.