అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market | ఐటీ స్టాక్స్ దూసుకుపోవడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు (Domestic stock markets) నూతన వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. సోమవారం ఉదయం సెన్సెక్స్ 195 పాయింట్ల లాభంతో ప్రారంభమై అక్కడినుంచి 137 పాయింట్లు తగ్గింది. తర్వాత పుంజుకుని ఇంట్రాడేలో గరిష్టంగా 435 పాయింట్లు పెరిగింది. 79 పాయింట్ల లాభంతో ప్రారంభమైన నిఫ్టీ (Nifty).. అక్కడినుంచి 55 పాయింట్లు కోల్పోయింది. తర్వాత కోలుకుని 127 పాయింట్లు ఎగబాకింది. చివరికి సెన్సెక్స్ (Sensex) 329 పాయింట్ల లాభంతో 81,635 వద్ద, నిఫ్టీ 97 పాయింట్ల లాభంతో 24,967 వద్ద స్థిరపడ్డాయి.
Stock Market | ఐటీ షేర్లలో జోరు..
ఐటీ రంగానికి చెందిన షేర్లు దూసుకెళ్లాయి. బీఎస్‌ఈలో ఐటీ ఇండెక్స్(IT index) 2.35 శాతం పెరిగింది. రియాలిటీ ఇండెక్స్ 0.74 శాతం, మెటల్ ఇండెక్స్ 0.67 శాతం, ఆటో 0.51 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్ 0.42 శాతం, కమోడిటీ ఇండెక్స్ 0.41 శాతం లాభపడ్డాయి. క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 0.42 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 0.31 శాతం, టెలికాం ఇండెక్స్ 0.25 శాతం నష్టపోయాయి. లార్జ్‌క్యాప్(Large cap) ఇండెక్స్ 0.37 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.10 శాతం పెరగ్గా.. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.02 శాతం నష్టంతో ముగిసింది.
అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 1,948 కంపెనీలు లాభపడగా 2,237 స్టాక్స్ నష్టపోయాయి. 201 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 164 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 84 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 11 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 7 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 21 కంపెనీలు లాభాలతో, 9 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఇన్ఫోసిస్ 3.03 శాతం, టీసీఎస్ 2.85 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.77 శాతం, టెక్ మహీంద్రా 1.32 శాతం, టాటా మోటార్స్ 0.95 శాతం లాభపడ్డాయి.
Top Losers : బీఈఎల్ 0.76 శాతం, ఆసియా పెయింట్ 0.39 శాతం, ఎయిర్‌టెల్ 0.38 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.21 శాతం, కొటక్ బ్యాంక్ 0.21 శాతం నష్టపోయాయి.