అక్షరటుడే, వెబ్‌డెస్క్: IT Sector Market Fall | గ్లోబల్ మార్కెట్లు (Global Markets) బలహీనంగా ఉండడంతో మన మార్కెట్లు ఒత్తిడికి గురయ్యాయి. ఐటీ సెక్టార్లో సెల్లాఫ్ కొనసాగింది. గురువారం ఉదయం సెన్సెక్స్ 265 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 47 పాయింట్ల నష్టంతో ప్రారంభమయ్యాయి.
సెన్సెక్స్ 83,516 నుంచి 84,061 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 25,752 నుంచి 25,906 పాయింట్ల మధ్యలో కదలాడాయి. చివరికి సెన్సెక్స్ 558 పాయింట్ల నష్టంతో 83,674 వద్ద, నిఫ్టీ (Nifty) 146 పాయింట్ల నష్టంతో 25,807 వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీ, సెన్సెక్స్‌లు 0.6 శాతం మేర నష్టపోయాయి.
టెక్ స్టాక్స్‌లో అమ్మకాలు..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market)లో ఐటీ రంగానికి చెందిన షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 5.51 శాతం పడిపోయింది. ఎఫ్ఎంసీజీ, రియాలిటీ, ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్, మీడియా, ఫార్మా రంగాల షేర్లు నష్టపోయాయి. కన్జూమర్ డ్యూరెబుల్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, టెలికాం ఇండెక్స్‌లు లాభాలతో ముగిశాయి.
అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,676 కంపెనీలు లాభపడగా 2,530 స్టాక్స్ నష్టపోయాయి. 162 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 140 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 111 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 9 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 9 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. స్టాక్ మార్కెట్ (Stock Market)లో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 2.29 లక్షల కోట్ల మేర తగ్గింది.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 13 స్టాక్స్ లాభాలతో, 17 స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. బజాజ్ ఫైనాన్స్ 3.17 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.86 శాతం, ట్రెంట్ 1.52 శాతం, బీఈఎల్ 1.43 శాతం, ఎస్బీఐ 0.80 శాతం లాభపడ్డాయి.
Top Losers : టెక్ మహీంద్రా 5.99 శాతం, ఇన్ఫోసిస్ 5.79 శాతం, టీసీఎస్ 5.41 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 4.84 శాతం, ఎంఅండఎం 2.23 శాతం నష్టపోయాయి.