IT searches in Nizamabad | నిజామాబాద్​లో ఐటీ సోదాల కలకలం.. బంగారు వర్తకులే టార్గెట్​!
IT searches in Nizamabad | నిజామాబాద్​లో ఐటీ సోదాల కలకలం.. బంగారు వర్తకులే టార్గెట్​!

అక్షరటుడే, ఇందూరు: IT searches in Nizamabad | నిజామాబాద్​ జిల్లాలో ఐటీ సోదాలు కలకలం రేపాయి. పరిమితికి మించి లావాదేవీలు జరిపిన వారిని టార్గెట్​ చేసుకుని దాడులు కొనసాగుతున్నాయి.

నిజామాబాద్​ గంజ్​ Ganj లోని పలు బంగారు దుకాణాల్లో శుక్రవారం ఉదయం నుంచి ఐటీ IT అధికారులు సోదాలు చేపట్టారు.

ముఖ్యంగా ఓ రెండు దుకాణాల్లో ఇన్​కమ్​ టాక్స్ రిటర్నుల income tax returns కు సంబంధించి వ్యత్యాసాలు గుర్తించిన అధికారులు సోదాలు జరిపారు.

ఈ క్రమంలో ఆదాయ పన్ను చెల్లింపుల్లో పెద్ద ఎత్తున తేడాలు గుర్తించినట్లు తెలుస్తోంది. కాగా, ఈ విషయమై సంబంధిత అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

IT searches in Nizamabad | బంగారం బిస్కెట్​ల దందా

నిజామాబాద్​ గంజ్​లోని పలు గోల్డ్ దుకాణాల్లో బంగారం బిస్కెట్​ల Gold biscuits దందా కొనసాగిస్తున్నారు. ఈ విషయమై ఐటీ అధికారులకు అందిన ప్రాథమిక సమాచారం ఆధారంగా తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది.

గత కొంత కాలంగా రూ. కోట్లలో దందా కొనసాగిస్తున్నప్పటికీ ఆదాయ పన్ను రిటర్నుల్లో మాత్రం లెక్క చూపట్లేదని సమాచారం.

కాగా, తనిఖీల సమయంలో అధికారులు పలు దస్త్రాలతోపాటు ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. మరో వైపు ఐటీ సోదాల నేపథ్యంలో ఇతర బంగారు దుకాణాల యజమానులు అలెర్ట్​ అయ్యారు. ముందస్తుగా దుకాణాలు మూసివేసి జాగ్రత్త పడ్డారు.

IT searches in Nizamabad | పన్ను ఎగవేత..

Nizamabad districtలో తాజా సోదాలకు సంబంధించి అధికారులు ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ పెద్ద మొత్తంలో పన్ను ఎగవేతకు పాల్పడినట్లు తెలుస్తోంది.